Kangana Ranaut : డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పుష్ప 2 సినిమా ఇప్పటికే 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, హిందీ భాషల్లోనూ అల్లు అర్జున్ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్ గడ్డపై పుష్ప రాజ్ హవా సాగుతోంది. ఇప్పటికే అక్కడి కలెక్షన్లు దాదాపు రూ. 500 కోట్లకు చేరువలో ఉన్నాయి. పుష్ప 2 సినిమా ధాటికి బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్(Kangana Ranaut) పుష్ప 2 సినిమాపై ప్రశంసలు కురిపించింది బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్.
అదే సమయంలో బాలీవుడ్ సినిమాలను ఏకీ పారేసింది. ఇక్కడ రియాలిటీకి చోటు లేదని తీవ్ర విమర్శలు గుప్పించింది. ‘హిందీ చిత్ర పరిశ్రమ వాస్తవికతను గ్రహించలేకపోతోంది. అందుకే సౌత్ చిత్రాలతో సరిపెట్టుకోలేకపోతోంది. బాలీవుడ్‌కు గ్లామర్‌పై మోజు ఎక్కువైంది. చాలా మంది హీరోలు, దర్శకులు సిక్స్ ప్యాక్ అబ్స్, హాట్ బేబ్, బీచ్‌లు, ఐటెమ్ నంబర్‌లను కోరుకుంటున్నారు. వారికి అది సరిపోతుంది. కానీ రియాలిటీ చెక్ చేసుకోవడం లేదు. బాలీవుడ్ నటీనటులు ఒక కంఫర్ట్ జోన్ లోనే ఉంటున్నారు. దానిని దాటి బయటకు రావడం లేదు’ అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించింది కంగనా.
Kangana Ranaut Comment..
సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో మెరిశాడు. అలాగే సునీల్, అనసూయ, జగపతిబాబు, జగదీశ్ ,రావు రమేశ్ , తారక్ పొన్నప్ప తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఒక ప్రత్యేక పాటలో కనువిందు చేసింది.
Also Read : Taapsee Pannu : తన పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ‘తాప్సి’