బాలీవుడ్ లో వివాదాస్పద నటిగా పేరు పొందారు కంగనా రనౌత్. ఆమె తాజాగా నటించిన తమిళ సీక్వెల్ చిత్రం చంద్రముఖి -2 విడుదలైంది. ఆశించిన మేర ఆకట్టుకోలేక పోయింది. ఇందులో రాఘవ లారెన్స్ కీలక పాత్ర పోషించారు.
గతంలో వచ్చిన చంద్రముఖి చిత్రంలో జ్యోతిక, రజనీకాంత్ నటించారు. బాక్సులు బద్దలు కొట్టింది. దీనికి కొనసాగింపుగా కీలకమైన పాత్రలో కంగనా రనౌత్ మెరిసింది. అయినా సక్సెస్ టాక్ తెచ్చుకోలేక పోయింది.
మరో వైపు నిజ జీవితం ఆధారంగా పైలట్ పాత్రలో మెరిసింది కంగనా రనౌత్. ఆ చిత్రం తేజస్. మరో వైపు దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. దీని పేరు ఎమర్జెన్సీ అని పేరు పెట్టారు. ఇందిర అంటే ఇండియా . ఇండియా అంటే ఇందిర.
విచిత్రం ఏమిటంటే భారత దేశ రాజకీయాలలో సంచలన పాత్ర పోషించింది ఇందిరా గాంధీ. ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఆ వెంటనే తన ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. దీనిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు దర్శకుడు. ఎమర్జెన్సీ పేరుతోనే తీసిన ఈ మూవీ నవంబర్ 24న విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ వైరల్ గా మారింది.