క్రియేటివిటీ కలిగిన సినీ రంగానికి చెందిన టెక్నీషియన్స్ , నటీ నటులు, దర్శక, నిర్మాతలకు లెక్క లేదు. ఎందరో అప్ కమింగ్ దర్శకులకు మణిరత్నం మార్గదర్శకుడు. ఆయన ఆధ్వర్యంలో తీసిన పొన్నియన్ సెల్వన్ చిత్రం బిగ్ సక్సెస్ అయ్యింది.
ఇక లోకనాయకుడిగా గుర్తింపు పొందారు కమల్ హాసన్. దిగ్గజ సంగీత దర్శకుడు అల్లా రఖా రెహమాన్ కాంబినేషన్ కంటిన్యూగా కొనసాగుతూ వస్తోంది. అద్భుతమైన ట్యూన్స్ అందించడంలో తనకు తనే సాటి. మణిరత్నం సినిమా రోజాతో ప్రారంభమైంది. ఇప్పటికీ నిరాంటంకంగా కొనసాగుతూనే ఉంది.
తాజాగా ఈ ముగ్గురి కాంబినేషన్ లో కొత్త చిత్రం చెన్నైలో ప్రారంభమైంది. విచిత్రం ఏమిటంటే 36 ఏళ్ల తర్వాత కాంబో రిపీట్ అయ్యింది. మణిరత్నం కమల్ తో 1987లో నాయకుడు తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ , మద్రాస్ టాకీస్ పతాకాలపై శివ అనంత్ , మహేంద్రన్, మణి రత్నం ఈ కొత్త మూవీని నిర్మిస్తుండడం విశేషం.
మణిరత్నం, రెహమాన్, కమల్ హాసన్ కాంబినేషన్ అంటేనే అంచనాలు భారీగా ఉన్నాయి. మొత్తంగా కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.