Bharateeyudu 3 : ఎన్నో అంచనాల మధ్య ఈ జూలైలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్‌గా నిలిచిన చిత్రం భారతీయుడు 2. కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ మూవీని పొన్నియన్ సెల్వన్ వంటి భారీ చిత్రం తర్వాత అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్.. రెడ్ జెయింట్ బ్యానర్‌తో కలిసి హై బడ్జెట్‌తో నిర్మించారు. విడుదలకు ముందు ప్రచార కార్య్రమాలతో హాడావుడి చేసినప్పటికీ సినిమాలోని అసలు లైన్‌ను ప్రమోట్ చేయకపోవడంతో ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది.
Bharateeyudu 3 Movie Updates
అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉన్న మూడవ భాగం భారతీయుడు 3(Bharateeyudu 3) (వార్ మోడ్) చిత్రం విషయంలో తీవ్ర సందిగ్ధం నెలకొంది. అయితే తాజాగా ఈ పార్ట్3పై సోషల్ మీడియాలో అసక్తికర విషయాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాములుగా అయితే ఈ సినిమాను జనవరి 2025లో థియేటర్లలో విడుదల చేయాలని ముందుగానే ఫ్లాన్ చేసుకున్నప్పటికీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. భారతీయుడు 2 రిలీజ్ అయినప్పుడే మూడో భాగం ట్రైలర్ విడుదల చేసినప్పటికీ ప్రేక్షకుల నుంచి అశించిన స్పందన రాలేదు. దీంతో ఈ సినిమా విడుదల విషయంలో మేకర్స్ సందిగ్దంలో పడ్డట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో ఇప్పటికే భారతీయుడు 2 సినిమా నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసి ఉండడంతో ఇప్పుడు ఈ పార్ట్ 3(Bharateeyudu 3)ని తిరిగి అదే సంస్థతో ఓ ఫ్యాన్సీ రేటుకు లైకా సంస్థ ఒప్పందం చేసుకుందని, అధికార ప్రకటన రావడమే తరువాయి అని న్యూస్ వైరల్ అవుతోంది. కాగా ఈ సినిమాను 2025 జనవరి నెలలో సంక్రాంతికి గానీ రిపబ్లిక్ డే సమయంలో గానీ ఓటీటీలో సౌత్‌లోని అన్ని భాషల్లో ఒకేసారి డైరెక్ట్‌గా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో నేషనల్ వైడ్‌గా టాప్‌లో ట్రెండింగ్ అవడం విశేషం. అయొతే ఇప్పటి వరకు మేకర్స్ గానీ సదరు ఓటీటీ ఫ్లాట్ ఫాం గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరికొద్ది రోజుల్లోనే ఈ వార్తపై క్లారిటీ రానుంది.
Also Read : Ram Gopal Varma : ఆ మంత్రి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన సరిపోదు