Kalyanram Devil: జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన సినిమాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ప్రస్తుతం కళ్యాణ్ రామ్…. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న ‘డెవిల్’ సినిమాలో నటిస్తున్నారు. డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు.
బింబిసార బ్లాక్ బస్టర్ విజయం అనంతరం ఆ స్థాయి విజయం కోసం ఎదురుచూస్తున్న కల్యాణ్ రామ్ నుంచి వస్తున్న తాజా చిత్రం డెవిల్ – ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్. పీరియాడిక్, స్పై థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను మంగళవారం విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ ను బట్టి బ్రిటీష్ పాలనలో ఓ నగరంలో జరిగే హత్యలు, ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఓ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నందమూరి కళ్యాణ్ రామ్(Kalyanram) ఎలా చేధించాడనే ఇతివృత్తంలో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆద్యంతం సస్పెన్స్‌తో, థ్రిల్లింగ్,యాక్షన్ సన్నివేశాలతో ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనితో నందమూరి అభిమానులు ‘డెవిల్’ ట్రైలర్ ను పదే పదే చూస్తున్నారు.
Kalyanram Devil – డిసెంబరు 29న వస్తున్న ‘డెవిల్’
అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ చిత్రంలో విరూపాక్ష, సర్ వంటి వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తుండగా, మాళవికా నాయర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నది. డిసెంబర్ 29న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.
Also Read : DJ Tillu: బొమ్మరిల్లు భాస్కర్ తో డిజే టిల్లు సినిమా