Kalki 2898AD: వైజయంతి మూవీస్ పతాకంపై ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న అతి భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 AD(Kalki 2898AD)’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ సినిమా నిర్మాత స్వప్నదత్ ఓ సరదా పోస్ట్ పెట్టారు.
Kalki 2898AD Movie Updates
‘కరెంట్ ఎఫైర్స్ ఆఫ్ వైజయంతి’ అంటూ నాగ్ అశ్విన్ కు తనకు మధ్య జరిగిన సరదా సంభాషణను ఇన్ స్టాలో రాసుకొచ్చారు. ‘‘కల్కి’ సీజీ వర్క్ చేస్తున్న వారంతా ఓటువేయడానికి హైదరాబాద్ నుంచి వాళ్ల ఊర్లకు వెళ్లారు ఇప్పుడెలా’ అని నాగ్ అశ్విన్ అనగా… ‘ఎవరు గెలుస్తారేంటి’ అని స్వప్న అడిగారు. దానికి ఆయన సరదాగా బదులిస్తూ… ‘ఎవరు గెలిస్తే నాకెందుకండీ… నా సీజీ షాట్స్ ఎప్పుడు వస్తాయో అని నేను ఎదురుచూస్తున్నా’ అన్నారు. దీనితో ‘కల్కి’ గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు అర్థమవుతోంది. మరోవైపు ఈ చిత్రాన్ని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈలోగా వర్క్ అంతా పూర్తి చేయాలని మూవీ యూనిట్ ప్రయత్నిస్తుంది.
వైజయంతి మూవీస్ పతాకంపై పాన్ వరల్డ్ సినిమాగా రూపొందిస్తున్న ‘కల్కి’ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. హాలీవుడ్ ఫ్యుచరిస్ట్ సినిమాల్లో అక్కడి సిటీలు భవిష్యత్ లో ఎలా ఉంటాయో చూశాం. ‘కల్కి’లో ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా ఉండబోతునాయో ప్రేక్షకులు చూస్తారు. ‘కల్కి’ కోసం దాదాపు ఐదేళ్ళుగా శ్రమిస్తున్నాం. ప్రతి అంశంపై లోతుగా అలోచించి, స్క్రాచ్ నుంచి అన్ని కొత్తగా డిజైన్ చేసి ఒక న్యూ వరల్డ్ ని బిల్డ్ చేశాం. ప్రేక్షకులకు అది తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను. దీని కాన్సెప్ట్ గురించి దర్శకుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ..‘‘మహాభారతంతో మొదలై.. క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ ఇది. మొత్తం ఆరు వేల ఏళ్ల వ్యవధిలో ఈ కథ విస్తరించి ఉంటుంది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన కథ కాబట్టి అందుకు తగ్గట్టుగా ఆయా ప్రపంచాల్ని సృష్టించడానికి ప్రయత్నించాం’ అన్నారు.
Also Read : Kriti Sanon: తనకు కాబోయే వాడికి ఉండాల్సిన క్వాలిటీస్ చెప్పిన కృతి సనన్ !