Kalki 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ సినిమాపై తెలంగాణ సినీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రశంసలు కురిపించారు. ‘కల్కి 2898 AD’ చిత్రాన్ని కుటుంబ సమేతంగా వీక్షించిన అనంతరం ట్విటర్ X వేదికగా సినిమా అద్భుతంగా ఉందని కొనియాడారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 AD’ని వైజయంతీ మూవీస్ నిర్మించింది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. శుక్రవారం తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి(Komatireddy Venkat Reddy) కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఈ సినిమాపై ఆయన స్పందిస్తూ..
Kalki 2898 AD…
“ఈరోజు మా కుటుంబం ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఎ.డి’ చిత్రాన్ని చూసింది, ఇది మహాభారతం మరియు భవిష్యత్తు కాలాల కలయిక, దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని చాలా అందంగా తీశారు. లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరియు బాలీవుడ్ నటి దీపికా పదుకొణె కొన్ని అద్భుతమైన అందించారు. ఈ చిత్రంలో కల్కి 2898 AD అనేది టాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విని దత్, స్వప్నదాస్ మరియు ప్రియాంక దత్ నిర్మించిన దృశ్య అద్భుతం.
ఈ సినిమా మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సినిమా విజయం సాధిస్తే… పరిశ్రమ పచ్చగా మారుతుంది. లక్షలాది మందికి పని దొరుకుతుంది. పౌరాణిక, సమకాలీన అంశాలు మేళవించిన ‘కల్కి’ వంటి గొప్ప చిత్రాలను ఈ తరం చూడాలని కోమటిరెడ్డి వెంకట రెడ్డి ట్వీట్ చేశారు.
Also Read : Actor Ali : టాలీవుడ్ నటుడు అలీ రాజకీయాలపై కీలక నిర్ణయం