Raayan Updates : ‘రాయన్’ సక్సెస్ పై ధనుష్ కు భారీ సర్ ప్రైజ్ ఇచ్చిన కళానిధి మారన్

కాగా ఈ మూవీ నిర్మాత కళానిధి మారన్ ధనుష్ కు రెండు చెక్కులను అందించారు...

Helo Telugu - Raayan Updates

Raayan : తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ రాయన్. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాకు ధనుష్ దర్శకత్వం వహించారు. రాయన్(Raayan) సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత తాజాగా నిర్మాత కళానిధి మారన్ ధనుష్ కి డబుల్ సర్ ప్రైజ్ ఇవ్వడం వైరల్ అవుతోంది. ధనుష్ తన 50వ చిత్రం ‘రాయన్ కు స్వీయ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో దుషార విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్.జె.సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి ఇతర పాత్రల్లో నటించారు. నార్త్ చెన్నై కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అలాగే ఈ సినిమాలో ధనుష్(Dhanush) ఇప్పటి వరకు ఏ సినిమాలో కనిపించని విధంగా గుండుతో కనిపించి ఆకట్టుకున్నాడు. ధనుష్‌కి 50వ సినిమా అయిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

Raayan Movie Updates

ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లైబ్రరీలోరాయన్ సినిమా చోటు దక్కించుకుంది. రాయన్(Raayan) సక్సెస్ తర్వాత ధనుష్ తన మూవీ టీమ్ కు బిర్యానీ పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ మూవీ నిర్మాత కళానిధి మారన్ ధనుష్ కు రెండు చెక్కులను అందించారు. ఈ విషయాన్ని సన్ పిచర్స్ ప్రకటించింది. రెండు చెక్కులను ఎందుకు ఇచ్చారో తెలుసా.. ఒకటి దర్శకుడిగా.. రెండోది నటుడిగా ఇలా రెండు చెక్కులను అందించారు. ఒకొక్క చెక్కులో కోటి రూపాయిల చొప్పున రెండు కోట్లు ఇచ్చారని తెలుస్తోంది.

గతంలో జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో సూపర్ స్టార్ రజినీకాంత్ కు చెక్కును అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కు కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇచ్చారు కళానిధి మారన్. ఇక రాయన్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ధనుష్ రాయన్ సినిమా తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. తెలుగులో సుమారు 550 థియేటర్లలో రిలీజ్ కాగా, ఇక్కడ కూడా బాగానే కలెక్షన్లు వచ్చాయి. దాదాపు రూ.100కోట్లవరకు వసూల్ చేసింది ఈ సినిమా. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన రాయన్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. నేటి నుంచి అంటే ఆగస్టు 23 నుంచి ఈ సూపర్ హిట్ సినిమాను స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read : Actress Hema : తనపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉరటనిచ్చిన ‘మా’ అసోసియేషన్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com