బాలీవుడ్ లో ప్రముఖ నటిగా పేరు పొందిన కాజోల్ ఉన్నట్టుండి సెకండ్ ఇన్నింగ్స్ డిఫరెంట్ గా ప్రారంభించారు. ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. లస్ట్ స్టోరీస్ లో అనుకున్న దానికంటే ఎక్కువగా హద్దులు దాటి నటించింది. ప్రస్తుతం మరో వెబ్ సీరీస్ నెట్ ఫ్లిక్స్ లో హల్ చల్ చేస్తోంది. దాని పేరే దో పట్టి.
ఇందులో కాజోల్ తో పాటు మరో నటి కృతీ సనన్ కూడా భాగస్వామిగా ఉంది. ఇద్దరూ పోటీపడి నటించారు. దర్శకుడు దో పట్టిని మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందించడంపై ఫోకస్ పెట్టారు. భారత దేశంలో పాతుకు పోయిన కథ మాత్రమే కాదు సరిహద్దులు దాటిన కథగా పేర్కొంది కాజోల్.
కృతీ సనన్ , కనికా ధిల్లాన్ లు దో పట్టి ద్వారా నిర్మాణ రంగంలోకి ఎంటర్ అయ్యారు. తన ప్రొడక్షన్ హౌస్ బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్స్ తో నిర్మాతగా అందించిన తొలి చిత్రంగా దో పట్టి నిలిచింది. నెట్ ఫ్లిక్స్ తో భాగస్వామి కావడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని చెప్పింది సనన్. ఏది ఏమైనా ఇప్పటికే విడుదలైన దో పట్టి ఇప్పటికీ జనాదరణను పొందడం అంటే మామూలు విషయం కాదు కదూ.
నెట్ ఫ్లిక్స్ లో రెడీగా ఉంది . వీలైతే మీరు కూడా ట్రై చేసి చూడండి. కాస్తంత వినోదం, మరింత థ్రిల్లింగ్ ను కలిగించక మానదు.