Kajol : ముంబై – ప్రముఖ బాలీవుడ్ నటి , నటుడు అజయ్ దేవగణ్ భార్య కాజోల్(Kajol) సంచలనంగా మారారు. ఆమె ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ. 28.78 కోట్లతో ప్రధాన వాణిజ్య ఆస్తిని కొనుగోలు చేసింది. ఆస్తి లావాదేవీ రికార్డుల ప్రకారం ఈ ఒప్పందం మార్చి 6న ఖరారైంది. ముంబై లోని బంగూరు నగర్ లోని లింకింగ్ రోడ్ లోని భారత్ అరైజ్ లో ఉన్న ఆస్తిని కొనుగోలు చేసింది. దీనిని భారత్ రియాల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నటి కాజోల్ కు విక్రయించింది.
Kajol Buys
తను కొనుగోలు చేసిన పత్రాల ప్రకారం స్థలం గ్రౌండ్ ఫ్లోర్ లోని షాప్ నెంబర్ 2 ను స్వంతం చేసుకుంది. ఇది 4,365 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీని ద్వారా కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఈ డీల్ చదరపు అడుగు ధర రూ. 65,940 చొప్పున చెల్లించింది కాజోల్. అంతే కాకుండా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు స్లాంప్ డ్యూటీ కింద రూ. 1.72 కోట్లు కట్టినట్లు స్పష్టం చేసింది నటి.
గోరేగావ్ వెస్ట్ ముంబైలో ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉద్భవించింది. ఇది అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు, వ్యాపారాల నుండి ఆసక్తిని ఆకర్షిస్తోంది. కాజోల్ కొనుగోలు బాలీవుడ్ ప్రముఖులు ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే పెరుగుతున్న ట్రెండ్‌కు తోడ్పడుతుంది. ప్రాంతం వ్యూహాత్మక స్థానం, బలమైన మౌలిక సదుపాయాలు, ప్రధాన వ్యాపార జిల్లాలకు సమీపంలో ఉండటం కారణంగా భారీ ధర ఇక్కడ పలుకుతోంది. మొత్తంగా ఈ కొనుగోలుతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు నటి కాజోల్.