Kajal Pasupathi: కో, మౌన గురు, కథమ్ కథమ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ నటి కాజల్ పసుపతి. తెలుగులో అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కించిన ద్విభాషా చిత్రం గౌరవంలో నటించింది. 2008 లో తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్‌ను పెళ్లి చేసుకున్న కాజల్(Kajal Pasupathi)… ఆ తరువాత విభేదాల కారణంగా 2012లో విడాకులు తీసుకుంది. దీనితో శాండీ మాస్టర్ సిల్వియాను అనే మరో యువతిని పెళ్ళి చేసుకోగా… కాజల్ మాత్రం పెళ్ళి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయింది. గతంలో ఓ బిడ్డను దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించిన కాజల్… తాజాగా తన రెండో పెళ్లి గురించి నెట్టింట చేసిన పోస్ట్ వైరలవుతోంది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు కొంతమంది కాజల్ కు అభినందనలు తెలుపుతుంటే… మరికొందరు మాత్రం ఇది ఫేక్ అంటూ కొట్టి పారేస్తున్నారు.
Kajal Pasupathi – కాజల్ చేసిన పోస్ట్ ఏంటి ?
కాజల్ తన ఇన్‌స్టాలో రాస్తూ… ‘ఫైనల్‌గా రెండో పెళ్లి చేసుకున్నా… నన్ను క్షమించండి ఫ్రెండ్స్… అందరూ క్షేమంగా ఉన్నారనే ఆశిస్తున్నా’ అంటూ కామెంట్ పెడుతూ తన పాత పెళ్లి ఫోటోను షేర్ చేసింది. దీనితో ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ కొందరు కంగ్రాట్స్ చెబుతుండగా… మరికొందరు మీ భర్త ఎవరంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా ఇదంతా ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు. అయితే కాజల్ కేవలం తన ఫోటోనే షేర్ చేయడంతో ఫ్రాంక్ చేసి ఉంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు. లేదా ఏదైనా మూవీ ప్రమోషన్ కోసం ఇలా చేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండో పెళ్లిపై క్లారిటీ రావాలంటే కాజల్ స్పందించాల్సిందే. అయితే గతంలో ఆమె ఓ బీజేపీ నేతను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
ALso Read : Vijay Antony : విజయ్ ఆంటోనీ ‘హిట్లర్’ టీజర్ రిలీజ్