Kannappa : మంచు విష్ణు టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ‘మహాభారత’ సిరీస్‌ని తెరకెక్కించిన ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ప్రీతి ముకుందన్ కథనాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎంతోమంది అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందులో కాజల్ పాత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె పార్వతీదేవిగా కనిపించనున్నటు పోస్టర్‌తో తెలిపారు.
Kannappa Movie Updates
మొదట ఈ సినిమా ప్రకటించినప్పుడు ప్రభాస్-నయనతారలు శివ పార్వతులుగా కనిపించనున్నారని టాక్ వినిపించింది. తాజాగా కాజల్ పార్వతీదేవిగా కనిపించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో శివుడిగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ నటించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఇక ఇందులో ప్రభాస్ నంది పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సే మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘కన్నప్ప’ చిత్రం అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. ఈ చిత్రానికి మోహన్‌బాబు నిర్మాతగా వ్యవహరించడంతోపాటు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
Also Read : SJ Suryah : ప్రస్తుతం దర్శకత్వంపై ఏమీ ఆలోచన లేదంటున్న ఎస్ జె సూర్య