Kajal Aggarwal : ఎవరైనా పెళ్లి అయ్యాక సినిమాలలో నటించాలని అనుకోరు. అలా కోరుకున్నా ఛాన్సులు రావు. ఇచ్చేందుకు కూడా ధైర్యం చేయరు దర్శక, నిర్మాతలు. మూవీ మేకర్స్ ఎప్పుడూ ఫ్రెస్ నెస్ ను కోరుకుంటారు.
Kajal Aggarwal Viral with her Acting
కానీ ఊహించని రీతిలో కాజల్ అగర్వాల్ కు సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా ప్రారంభమైంది. తను కూడా అనుకోలేదు. నందమూరి బాలకృష్ణ తో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన భగవంత్ కేసరి మూవీలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా బిగ్ సక్సెస్ అయ్యింది. ఏకంగా రూ. 100 కోట్లు వసూలు చేసింది. ఓటీటీలో కూడా దుమ్ము రేపుతోంది.
ఇదే సమయంలో పెళ్లి చేసుకుంది. బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అనుకోకుండా ఛాన్స్ లు రావడంతో ఫుల్ ఖుషీగా ఉంది నటి కాజల్ అగర్వాల్(Kajal Aggrwal). ఇండియన్ టాప్ డైరెక్టర్ ఎస్ . శంకర్ దర్శకత్వంలో దిగ్గజ నటుడు , లోక నాయకుడిగా గుర్తింపు పొందిన కమల్ హాసన్ తో కలిసి భారతీయుడు -2 చిత్రం లో నటిస్తోంది.
ఇందు కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నట్లు చెప్పింది . దీంతో పాటు తాజాగా లేడీ ఓరియంటెడ్ మూవీ సత్యభామ లో నటించింది. సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. భారీ ఎత్తున ఆదరణ లభిస్తోంది.
Also Read : Kareena Kapoor : కరణ్ కామెంట్స్ కరీనా ఝలక్