Kajal Agaarwal : దీపావళికి “సత్యభామ” టీజర్

దీపావళి కానుకగా కాజల్ "సత్యభామ" టీజర్

Hellotelugu-Kajal Agaarwal

దీపావళికి కాజల్ “సత్యభామ”

Kajal Agaarwal : అందం, అభినయంతో అందాల చందమామగా మిత్రవిందగా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు పెంచింది. తన పెళ్ళి తరువాత భగవంత్ కేసరి, ఇండియన్-2 లో నటిస్తున్న అందాల భామ…. లేడీ ఓరియెంటెడ్ సినిమా “సత్యభామ” లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ప్రకాష్‌ రాజ్‌, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. శక్తి వంతమైన పోలీస్ ఆఫీసర్ కాజల్(Kajal Agaarwal) నటిస్తున్న ఈ సినిమాను భిన్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ ను అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. `మేజర్` చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించిన ఈ మూవీకి సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ చరణ్‌ పాకాల మ్యూజిక్‌, జీ విష్ణు కెమెరా వర్క్ చేస్తున్నారు.

Kajal Agaarwal – దివాళీ ట్రీట్ గా “సత్యభామ” టీజర్

“సత్యభామ” సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ఇప్పటికే విడుదలైంది. కాజల్ కనిపించింది కాసేపే అయినా యాక్షన్‌తోనూ అదరగొట్టింది. ఆ తర్వాత శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీనితో సరికొత్త అప్‌డేట్‌తో దీపావళి పండుక్కి సర్‌ప్రైజ్‌ చేయబోతుంది “సత్యభామ” టీమ్. దీపావళి సందర్భంగా టీజర్ ద్వారా పటాసుల్లాంటి ట్రీట్‌ ఇవ్వబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనితో “సత్యభామ” ద్వారా కాజల్ పేల్చబోయే టపాసుల కోసం అభిమానులు ఆశక్తిగా ఎదురూస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బాబీ తిక్క మాట్లాడుతూ, “సత్యభామ`లో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికి దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తిచేశాం. ఇటీవలే హైదరాబాద్ లో కాజల్ అగర్వాల్ పాల్గొన్న కీలక సన్నివేశాల తో పాటు యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించాం. ఈ నెల రెండో వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించబోతున్నట్లు ఆయన స్పష్టం చేసారు.

Also Read : Kamal Hasan: ‘థగ్‌ లైఫ్‌’

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com