Kaala: రజనీకాంత్ ‘కాలా’ సినిమాకు అరుదైన గౌరవం !

రజనీకాంత్ ‘కాలా’ సినిమాకు అరుదైన గౌరవం !

Hello Telugu - Kaala

Kaala: ‘నేల నీకు అధికారం… అది మాకు జీవితం’’ అంటూ తాము జీవించే నేలను దక్కించుకోవడానికి ప్రజల్లో స్ఫూర్తినింపే కరికాలుడుగా ‘కాలా’ చిత్రంలో కనిపించి మంచి ప్రశంసలు అందుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్‌. ఆయన ప్రధాన పాత్రలో పా. రంజిత్‌ తెరకెక్కించిన ఈ యాక్షన్‌ సినిమా… 2018లో విడుదలైన బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయినా అధికారం కోసం ఉన్నత… అణగారిన వర్గాల మధ్య జరిగే పోరాటాన్ని… దర్శకుడు పా రంజిత్ చూపించిన విధానం ప్రేక్షకులను మెప్పించింది.

Kaala Movies Updates

తాజాగా ఈ ‘కాలా’ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్‌ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ సైట్‌ అండ్‌ సౌండ్‌ మ్యాగజైన్‌ లో 21వ శతాబ్దాపు అద్భుతమైన 25 చిత్రాల జాబితాలో ‘కాలా(Kaala)’కు స్థానం లభించింది. అంతేకాదు ఈ మ్యాగజైన్‌ లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ సినిమా కూడా ఇదే కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా అనేక చిత్రాలను విశ్లేషించి విడుదల చేసిన ఈ జాబితాలో ‘ఓల్డ్‌ బాయ్‌’, ‘గెట్‌ అవుట్‌’ లాంటి సినిమాలు ఉన్నాయి. ‘‘21వ శతాబ్దం నాలుగు భాగాల్లో ఒక భాగం ముగింపుకు వచ్చిన నేపథ్యంలో మా దగ్గర ఉన్న 25మంది అత్యుత్తమ సినీ విమర్శకుల విశ్లేషణ ఆధారంగా ఈ అరుదైన మైలురాయిని ఆవిష్కరిస్తున్నాం. 2000-2024 మధ్య వచ్చిన సినిమాల్లో అన్ని విభాగాల్లోనూ మంచి ప్రదర్శన కలిగిన 25 చిత్రాలను ఎంపిక చేశాం. ప్రతి సంవత్సరం ఒక్కో సినిమాను తీసుకున్నాం’’ అని బీఎఫ్‌ఐ ఓ ప్రకటనలో తెలిపింది. దీనితో రజనీ అభిమానులు ఖషీ అవుతున్నారు.

Also Read : Naga Chaitanya: శ్రీకాకుళంలో నాగచైతన్య ‘తండేల్‌’ షూటింగ్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com