కన్నడ సినీ దర్శకుడు ప్రశాంత్ నీల్ సంచలన ప్రకటన చేశాడు. గత కొంత నుంచి టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. దీనికి పుల్ స్టాప్ పెట్టాడు డైరెక్టర్. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మూవీ చేస్తున్నట్లు ధ్రువీకరించాడు.
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించాడు ప్రశాంత్ నీల్. దీంతో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ మూవీపై. ఇక నీల్ అంటేనే ఓ మార్క్ ఉంటుంది. యశ్ తో కేజీఎఫ్ తీశాడు. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దానిని సీక్వెల్ గా తీశాడు. అది కూడా రికార్డ్ బ్రేక్ చేసింది.
ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ తో సలార్ తీశాడు. అది కూడా త్వరలో రిలీజ్ కాబోతోంది. మరో వైపు దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ తీస్తున్నాడు. ఇది కూడా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇందులో శ్రీదేవి ముద్దుల తనయ జాహ్నవి కపూర్ తారక్ కు జోడీగా నటిస్తోంది.
ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఎవరిని హీరోయిన్ గా తీసుకుంటాడనేది ప్రకటించ లేదు. త్వరలోనే తారాగణం, సాంకేతిక టీంను కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది .