Jr NTR : హైదరాబాద్ – తెలుగు జాతి గర్వించ దగిన మహోన్నత మానవుడు దివంగత నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ప్రపంచంలో సూర్య చంద్రులు ఉన్నంత కాలం బతికే ఉంటారని అన్నారు. ఇవాళ ఎన్టీఆర్ వర్దంతి. ఈ సందర్బంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
Jr NTR Pays Trubute to Sr NTR..
తనకు ఎన్టీఆరే ఆదర్శమని చెప్పారు. నివాళులు అర్పించిన అనంతరం జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) మీడియాతో మాట్లాడారు. తనతో పాటు సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సైతం తన తాతకు నివాళులు అర్పించారు. ఇలాంటి వ్యక్తి ఈ భూమి మీద పుట్టాడంటే ఎవరూ నమ్మరని అన్నారు.
తన జీవితమంతా ప్రజల కోసం పరితపించిన ఒకే ఒక్కడు, యుగానికి ఒక్కడు ఎన్టీఆర్ అంటూ కొనియాడారు ఎన్టీఆర్. పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే తన లక్ష్యంగా పని చేశాడని, చివరి దాకా వారి కోసమే జీవించిన ఘనత తన తాతకు దక్కుతుందన్నారు.
తను ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశాన్ని నివ్వెర పోయేలా చేశాయని అన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, మహిళలకు చట్ట సభల్లో అవకాశం కల్పించడం, కొన్ని తరాలకు సరిపడా నాయకులను తయారు చేసిన ఘనత ఒక్క ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు నందమూరి బాలయ్య.
కేవలం 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీని ఉమ్మడి ఏపీలో అధికారంలోకి తీసుకు వచ్చిన చరిత్ర తన తండ్రికి మాత్రమే ఉందన్నారు. ఇప్పటి వరకు ఆ రికార్డు దరి దాపుల్లోకి రాలేక పోయారని చెప్పారు.
Also Read : Hero Balakrishna – NTR : యుగానికి ఒక్కడు ఎన్టీఆర్ – బాలయ్య