NTR: గడచిన సంవత్సరం ‘దేవర’తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు కథానాయకుడు ఎన్టీఆర్. ఇప్పుడాయన బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. ఈ నెలలోనే తారక్ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఈలోగానే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందనున్న కొత్త సినిమా పట్టాలెక్కనుంది. మైత్రీ మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. ఈ నెల మూడో వారంలో కర్ణాటకలో తొలి షెడ్యూల్ మొదలు కానుందని తెలిసింది.
Jr NTR Movie Updates
ఎన్టీఆర్ వచ్చే నెలలో సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నారని సినీ వర్గాల నుంచి సమాచారం. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో తారక్ ఇంతకుముందు చేయని శక్తిమంతమైన పాత్రలో సందడి చేయనున్నారు. ఆయనకు జోడీగా రుక్మిణీ వసంత్ కనిపించే అవకాశముంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Hero Nikhil : ప్రత్యేకంగా గవర్నర్ జిష్ణు దేవ్ ను కలిసిన హీరో నిఖిల్