Jr NTR : ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం దేవర. కొరలాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. వేసవి వచ్చిందంటే సాధారణంగా స్టార్ హీరోలందరూ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్తుంటారు. అయితే ఈ వేసవిలో కూడా ఎన్టీఆర్ విరామం తీసుకోరంటున్నారు. వెకేషన్ ప్లాన్స్ ఏమీ లేవని, వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని తారక్ భావిస్తున్నారు. అందుకే ఈ సినిమా కోసం తన వంతు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ పార్ట్ దాదాపు పూర్తయింది. చిత్ర బృందం ఈ వారం గోవా వెళ్లనుంది. అక్కడ ఎన్టీఆర్, జాన్వీల పాటలు, కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
Jr NTR Movie Updates
ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ‘జనతా గ్యారేజ్’ సక్సెస్ తర్వాత కొరటాల శివతో కలిసి చేస్తున్న తారక్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Also Read : Harika Narayan : 7ఏళ్ళు ప్రేమించిన ప్రియుడితో ఏడడుగులు వేసిన హారిక