Jr NTR : ‘దేవర’ టైటిల్ నిర్ణయంపై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్

తొలుత ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీకపూర్‌ను అనుకోలేదు...

Hello Telugu - Jr NTR

Jr NTR : ‘దేవర’ రిలీజ్‌ దగ్గరపడుతున్న కొద్దీ టెన్షన్‌ పెరుగుతుందన్నారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(Jr NTR) . ఆయన నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. ‘ జనతా గ్యారేజ్‌’ తర్వాత ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటించారు ’ రెండు భాగాలుగాతెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి భాగాన్ని సెప్టెంబర్‌ 27న విడుదల చేయనున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిత్ర బృందం. తాజాగా చెన్నైలో జరిగిన కార్యక్రమలో ఎన్టీఆర్‌ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. టీమ్‌ అంతా బెస్ట్‌ అవుట్‌పుట్‌ కోసం ఎంతో శ్రమించామని, సినిమాపై నమ్మకంగా ఉన్నామని చెప్పారు. మరో పక్క టెన్షన్‌గా కూడా ఉందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌’ మాదిరిగా, దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువయ్యే టైటిల్‌ పెట్టాలనుకున్నాం. ఆ ఆలోచనతోనే ‘దేవర’ టైటిల్‌ ఫైనల్‌ చేశాం. ‘ దేవర’ అంటే దేవుడు అని అర్థం’’ అని ఆయన అన్నారు.

Jr NTR Comment

తొలుత ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీకపూర్‌ను అనుకోలేదు. కథ రాస్తున్నప్పుడు కథానాయికగా ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో మాకు ఎలాంటి ఆలోచన లేదు. అలాంటి సమయంలో కరణ్‌ జోహార్‌ కాల్‌ చేసి.. ‘జాన్వీ మంచి నటి. ఆమెను మన సినిమాలో తీసుకుంటే బాగుంటుంది’ అని సలహా ఇచ్చారు. అయినా మేం ఆమెను తీసుకోవాలని అనుకోలేదు. కానీ ఆమె ఇందులో యాక్ట్‌ చేయాలని బలంగా కోరుకున్నారు. స్ర్కిప్ట్‌ రైటింగ్‌ పూర్తయ్యే సమయానికి మా టీమ్‌లోకి వచ్చారు. యాక్టింగ్‌, లాంగ్వేజ్‌ విషయంలో జాన్వీ చాలా కంగారు పడ్డారు. కానీ చక్కగా యాక్ట్‌ చేశారు. ఆమె యాక్టింగ్‌తో షాక్‌కు గురి చేశారు’’ అని ఎన్టీఆర్‌(Jr NTR) అన్నారు.

ఇక సంగీత దర్శకుడు అనిరుద్ధ్‌ పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ తన సంగీతంతో అనిరుద్ధ్‌ రవిచంద్రన్‌ అదరగొడుతున్నారు. ప్రస్తుతం ఆయన శకం నడుస్తోంది. విజయం అందుకున్న కొంతకాలానికి వివిధ కారణాల వల్ల చాలామంది విఫలం అవుతారు. కానీ అనిరుద్ధ్‌ అలా కాదు. సినిమాకు సంగీతం ఎంత అవసరమో అతనికి బాగా తెలుసు. అనుకున్న అవుట్‌పుట్‌ వచ్చేవరకూ కష్టపడుతూనే ఉంటాడు. జైలర్‌, విక్రమ్‌, మాస్టర్‌ చిత్రాలకు ఆయన అద్భుతమైన సంగీతం ఇచ్చారు. భవిష్యత్తులో ఏఆర్‌ రెహమాన్‌ స్థాయికి వెళ్తాడు. అంతర్జాతీయ చిత్రాలకూ కంపోజ్‌ చేసే సత్తా అతనిలో ఉంది’’ అని తారక్‌ అన్నారు.

Also Read : Deepika Padukone: ముంబైలో ఖరీదైన అపార్ట్‌మెంట్‌ కొన్న దీపికా పదుకొణె కంపెనీ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com