Devara Collections : ‘దేవర’ మొదటి రోజు వసూళ్లు ఇలా ఉన్నాయి మరి..

సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా భైర పాత్రతో ఆకట్టుకున్నారు...

Hello Telugu - Devara Collections

Devara : సోలో హీరోగా ఎన్టీఆర్‌ని తెరపై చూసి ఆరేళ్లు అవుతోంది. అభిమానులు ఆయన చిత్రం కోసం ఎంతో ఆతురతగా ఎదురు చూశారు. ‘ దేవర(Devara)’తో ఆరేళ్ల తర్వాత యంగ్‌ టైగర్‌ సోల్‌ రిలీజ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొరటాల శివ దర్శకత్వం వహించారు. యాక్షన్‌ డ్రామాగా ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధించింది. రిలీజ్‌కు ముందు టికెట్‌ బుకింగ్స్‌లోనే పలు రికార్డులను సొంతం చేసుకుంది. మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మంచి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా రూ.77కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్లు సాధించిందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలో వచ్చిన కలెక్షన్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ కాకుండా రూ.54.21 కోట్లు వసూళ్లు రాబట్టిందని చిత్ర బృందం ప్రకటించింది. మొదటి రోజు కలెక్షన్లతో తెలుగు రాష్ట్రాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఇది రెండో స్థానంలో ఉందని చెబుతున్నారు.

Devara 1st Day Collections..

Nizam – 19.32

Vizag – 5.47

Guntur – 6.27

Nellore – 2.11

Krishna – 3.02

East – 4.02

West -3.60

Ceeded – 10.40

Andhra Pradesh and Telangana Share – 54.21 crores

సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా భైర పాత్రతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంపై విదేశాల్లో ఉన్న తారక్‌ స్పందించారు. ‘ దేవర’ను ఆదరించినందుకు ప్రేక్షకులకు ఎన్టీఆర్‌ కృతజ్ఞతలు చెప్పారు. ‘‘నా అభిమానులు వేడుకలు చూసి నా మనసు నిండిపోయింది. మీ ప్రేమాభిమానాలకు నేను ఎప్పుడు రుణపడి ఉంటా. నాలానే మీరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్‌ చేయడం చూస్తుంటే సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మీరు ఇంకా వినోదాన్ని అందిస్తా’’ అని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు.

Also Read : Satyam Sundaram Review : తమిళ హీరో కార్తీ ‘సత్యం సుందరం’ సినిమా రివ్యూ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com