Jr NTR : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన బన్నీ కెరీర్ లో కొన్ని డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. అందులో నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ఒకటి. ఇందులో బన్నీ(Allu Arjun) సరసన అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించగా.. రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఫేమస్ రచయితలలో వక్కంతం వంశీ ఒకరు. ఇండస్ట్రీలో మంచి రైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా ఇదే. ఈ మూవీతోనే తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు వక్కంతం వంశీ.
Jr NTR Movie..
భారీ హైప్ మధ్య విడుదలైన సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా ముందుగా అనుకున్న హీరో అల్లు అర్జున్ కాదట. ఈ చిత్రాన్ని బన్నీ కాకుండా జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) చేయాల్సిందట. ఈ విషయాన్ని స్వయంగా వక్కంతం వంశీ ఓ సందర్భంలో వెల్లడించారు. గతంలో అలీతో సరదాగా షోలో పాల్గోన్న వక్కంతం వంశీ తన వ్యకిగత జీవితం.. సినీ కెరీర్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు. తనకు రవితేజ నటించిన కిక్ సినిమా రచయితగా గుర్తింపు ఇచ్చిందని చెప్పారు. అలాగే టెంపర్ సినిమా కథను ఎన్టీఆర్ కు చెప్పగానే దానికి నేను సూట్ అవుతానా ? అని అడిగాడని.. కానీ ఆ సినిమా క్లైమాక్స్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.
ఇక అల్లు అర్జున్ నటించిన నాపేరు సూర్య… నా ఇల్లు ఇండియా సినిమా కథను ముందుగా తారక్ కోసం అనుకున్నానని అన్నారు. అప్పటికే తనని దర్శకుడిగా పరిచయం చేస్తానని ఎన్టీఆర్ చెప్పినందుకే తారక్ కోసమే ఆ స్టోరీ రెడీ చేశానని.. కానీ అది చివరకు అల్లు అర్జున్ చేతుల్లోకి వెళ్లింది అని చెప్పుకొచ్చారు.
Also Read : Ram Charan : హీరో చరణ్ కి మేడమ్ టుస్సాడ్స్ నుంచి ఓ అరుదైన గౌరవం