Jonitha Gandhi : భారత్ లో పుట్టి కెనెడాలో పెరిగిన జోనితా గాంధీ ఇప్పుడు భారత దేశంలో వైరల్ గా మారారు. కారణం తన అద్బుతమైన గొంతుతో ఆకట్టుకుంటూ అలరిస్తూ ఉండడమే. ఏ పాట ఇచ్చినా వెంటనే దానిని సక్సెస్ చేసేందుకు కృషి చేస్తుండడంతో సంగీత దర్శకుడు జోనితాను ఎంపిక చేసుకుంటున్నారు.
Jonitha Gandhi Viral with her Voice
అపరిమితమైన అవకాశాలు కూడా ఇస్తున్నారు. తమిళ సినీ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ గా పేరు పొందిన అనిరుధ్ రవిచందర్ అయితే జోనితా(Jonitha Gandhi) ను విడిచి పెట్టడం లేదు. ఎందుకంటే తనతో కలిసి అనిరుధ్ పలు పాటలు పాడాడు. అవి బిగ్ హిట్ గా నిలిచాయి.
ప్రస్తుతం తనకు 34 ఏళ్లు. క్లాసికల్ మ్యూజిక్, పాశ్చాత్య సంగీతంపై మంచి పట్టుంది తనకు. 2011 నుంచి తన కెరీర్ ను స్టార్ట్ చేసింది సింగర్ గా. ప్రధానంగా హిందీ, తమిళం భాషలలో ఎక్కువగా పాటలు పాడుతోంది. వీటితో పాటు పంజాబీ,
తెలుగు, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా కొన్ని పాటలు పాడింది. విచిత్రం ఏమిటంటే ఆమె సింగర్ కాక ముందు యూట్యూబర్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది జోనితా గాంధీ. తన గొంతుతో పాటు అందం కూడా తోడవడంతో ఇప్పుడు హాట్ సీటుపై తను టాప్ లో కొనసాగుతోంది.
2013లో చెన్నై ఎక్స్ ప్రెస్ టైటిల్ ట్రాక్ తో ప్రారంభించింది. ఏ దిల్ హై ముష్కిల్ మూవీలో తను పాడిన పాటకు మంచి పేరు వచ్చింది. 2022లో వచ్చిన బీస్ట్ మూవీలో తను పాడిన అరబిక్ కుతు పాట సెన్సేషన్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా ఈ పాటకు మంచి పేరు వచ్చింది. మొత్తంగా మరోసారి జోనితా గాంధీ తన పంజాబీ పాటతో వైరల్ గా మారారు.
Also Read : Mrunal Thakur : ముద్దుగుమ్మ నవ్వుకు ఫిదా