John Abraham: కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటనపై రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులతో పాటు యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. తాజాగా నటుడు జాన్ అబ్రహం ఈ అంశంపై మాట్లాడారు. అబ్బాయిలు ఎలా నడుచుకోవాలో తల్లిదండ్రులే నేర్పాలన్నారు. తాజాగా ఓ రేడియో ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అబ్రహం కోల్‌కతా ఘటనపై మాట్లాడారు. అబ్బాయిల పెంపకంలో మన వైఫల్యానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు.
John Abraham Comment
‘‘అబ్బాయిలు ఎలా ప్రవర్తించాలో చెబుతాను. వినకపోతే వాళ్లను చీల్చి చండాడుతా. అబ్బాయిలు మెరుగైన పెంపకంలో పెరగాలని ఆశిస్తున్నా. వారికి తల్లిదండ్రులే అన్ని విషయాలూ నేర్పాలి. ఇందులో అమ్మాయిల తప్పు ఏం ఉంది ? అందువల్ల నేను వాళ్లకి ఏం చెప్పాలనుకోవడం లేదు’’ అని తెలిపారు. అమ్మాయిలు మరింత ధైర్యంగా ముందుకెళ్లాలన్నారు. గత నెలలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అబ్రహం… దేశంలో మహిళలు, పిల్లలకు రక్షణ లేదని తెలిపారు. మహిళలతో ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని ప్రతి అబ్బాయీ నేర్చుకోవాలని, వారికి రక్షణకులుగా ఉండాలని సూచించారు.
Also Read : Allu Arjun: పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ మామ సంచలన వ్యాఖ్యలు !