Jigarthanda DoubleX: కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధానపాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్(Jigarthanda DoubleX)’. 2014లో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సిద్ధార్ధ్, బాబీ సింహీ, లక్ష్మీమీనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘జిగర్ తండ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో… హరీష్ శంకర్ దర్వకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలో తెలుగులో దానిని గద్దలకొండ గణేష్ (వాల్మీకి)గా రీమేక్ చేసారు.
Jigarthanda DoubleX- డిసెంబర్ 8న నెట్ ఫ్లిక్స్ లో ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’
దీనితో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ‘జిగర్ తండ’ సినిమాకు సీక్వెల్‌గా ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’ ను తెరకెక్కించి దీపావళి కానుకగా విడుదల చేసాడు. యాక్షన్ కామెడీ చిత్రంగా మిక్సిడ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’ త్వరలో ఓటీటీలోనూ అలరించడానికి సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంచనున్నట్లు నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం తెలిపింది. త్వరలోనే ఇంగ్లిషులోనూ ప్రసారం చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలిపింది.
‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’ కథ ఏమిటంటే
చిన్ననాటి నుండి పోలీసు అవ్వాలని కల కన్న కృపాకర్ (ఎస్.జె.సూర్య) ఎస్సై పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పోలీస్‌శాఖలో ఉద్యోగం సంపాదించుకుంటాడు. అంతలోనే కృపాకర్ అనూహ్యంగా చేయని తప్పునకు ఓ హత్య కేసులో జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి తనకొక మార్గం దొరుకుతుంది. కర్నూల్‌లోని జిగర్ తండ(Jigarthanda) మర్డర్ క్లబ్ గ్యాంగ్‌స్టర్ సీజర్ (లారెన్స్)ను చంపే ఆపరేషన్‌ను అతనికి అప్పగిస్తారు. తను ఆ పని పూర్తి చేస్తే కేసు నుంచి బయట పడటమే కాకుండా ఎస్సై ఉద్యోగం కూడా తిరిగి వస్తుందని హామీ దొరుకుతుంది.
దీనితో ఆ ఆపరేషన్‌ను పూర్తి చేసేందుకు ఒప్పుకున్న కృపాకర్… సీజర్‌కు హీరో అవ్వాలన్న పిచ్చి ఉందని తెలిసి.. దాన్ని అడ్డం పెట్టుకొని రే దాసన్ అనే దర్శకుడిగా అతడి దగ్గర చేరతాడు. తనతో పాన్ ఇండియా సినిమా తీస్తానని చెప్పి.. హత్యకు ప్రణాళిక రచిస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది ? రే దాసన్ ప్రణాళిక ఫలించిందా ? పాన్ ఇండియా తొలి నల్ల హీరోగా పేరు తెచ్చుకోవాలనుకున్న సీజర్ కల నెరవేరిందా ? వీళ్ల కథకూ… నల్లమల అడవుల్లో ఏనుగుల్ని చంపి.. దంతాలు తరలించే క్రూరమైన సెటానీకి ఉన్న సంబంధం ఏంటి? ఈ మొత్తం వ్యవహారం వెనకున్న రాజకీయ కోణమేంటి ? అనేదే మిగతా కథ.
Also Read : Babloo Prithiveeraj: పెళ్లైన ఏడాదికే విడాకులకు సిద్ధమైన టాలీవుడ్ నటుడు ?