Jigarthanda Double X: తమిళ డైరెక్టర్ పై వెంకీ ప్రశంసల వర్షం

తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుపై విక్టరీ వెంకటేష్ ప్రశంసలు

Hellotelugu- Jigarthanda Double X

కార్తీక్ సుబ్బరాజ్ పై వెంకీ ప్రశంసల వర్షం

Jigarthanda Double X : విక్టరీ వెంకటేష్ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘కార్తీక్ సుబ్బరాజు’ ఓ కల్ట్ డైరెక్టర్ అంటూ కితాబుఇచ్చారు. ‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’ ట్రైలర్‌ అదిరిపోయింది. కార్తీక్‌ సుబ్బరాజు టేకింగ్‌ ఎలా ఉంటుందో మరోసారి ఈ ట్రైలర్‌తో చూపించాడు అంటూ వెంకీ అమాంతంగా డైరెక్టర్ పొగడ్తలతో ముంచెత్తాడు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌(Jigarthanda Double X)’ బిక్ టికెట్ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయిన విక్టరీ వెంకటేష్, లారెన్స్ లో పాటు పెళ్ళికళ వచ్చే సిందే బాలా అంటూ ప్రేమించుకుందాం రా.. సినిమా స్టెప్పులు వేస్తూ సినిమా ప్రమోషన్ ను ఓ రేంజ్ కు తీసుకెళ్ళారు. అంతేకాదు కార్తీక్ సుబ్బరాజ్ త్వరలో నా కోసం కూడా ఓ స్క్రిప్ట్ రూపొందిస్తాడని అనుకుంటున్నానని… తన మనసులో మాటను బయటపెట్టాడు.

Jigarthanda Double X : దీపావళికి కానుకగా ‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’

కొరియాగ్రాఫర్ గా, దర్శకుడిగా, హీరోగా మల్టీ రోల్ నిర్వహిస్తున్న రాఘవ లారెన్స్, డైరెక్షన్ నుండి విలన్ గా హీరోగా మారిన ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో తమిళ సన్సేషనల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన చిత్రం ‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’. స్టోన్‌ బెంచ్‌ పతాకంపై కార్తికేయన్‌ సంతానం నిర్మించిని ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబరు 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇటీవల ఈ చిత్ర విడుదల ప్రీ రిలీజ్ ఈవెంట్/ బిక్ టిక్కెట్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హీరో వెంకటేశ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని బిగ్‌ టికెట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య లాంటి ప్రతిభావంతులైన నటులు ఈ చిత్రంలో నటించారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’ తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’ నాకు ప్రత్యేకం – కార్తీక్ సుబ్బరాజు

‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’ నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. నాలుగున్నరేళ్ల తర్వాత థియేటర్లలో విడుదలవుతోంది. కచ్చితంగా ఎవరినీ నిరుత్సాహ పరచదు. అందరూ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతారు’’ అన్నారు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు.

Also Read : Samantha: క్రయోథెరపీ చేయించుకుంటున్న సమంత

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com