Jayapradha: అజ్ఞాతంలో జయప్రద… వెతుకుతున్న పోలీసులు

అజ్ఞాతంలో జయప్రద... వెతుకుతున్న పోలీసులు

Hello Telugu - Jayapradha

Jayapradha: మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద కోసం ఢిల్లీ పోలీసులు వెతుకుతున్నారు. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్ వారెంట్‌ జారీ చేసింది. జనవరి 10లోపు ఆమెను కోర్టులో హాజరుపరచాలంటూ రాంపూర్ కోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే జయప్రద ఆచూకీ తెలియకపోవడంతో… రాంపూర్ ఎస్పీ ఆమెను వెతకడానికి స్పెషల్ టీంను రంగంలోనికి దించారు. అయితే ఈ స్పెషల్ టీం కూడా ఆమె ఆచూకీను ఇంతవరకు కనిపెట్టలేకపోయింది. ప్రస్తుతం జయప్రద(Jayaprada) ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది ఎవరకీ తెలియకపోవడంతో పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Jayapradha – కేసు ఏంటంటే…?

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్‌ నుంచి జయప్రద(Jayapradha) బరిలో నిలిచారు. అయితే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత ఆమె ఓ రోడ్డును ప్రారంభించడంతో స్వార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైంది. 2019లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు. అప్పటి నుంచి ఈ కేసు రాంపూర్‌లోని ఎంపీ- ఎమ్మెల్యే కోర్టులో పెండింగ్‌లో ఉంది. గతంలో ఆమె వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినా జయప్రద స్పందించకపోవడంతో.. కోర్టు ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది.

నవంబర్‌ 8న ఈ కేసుపై విచారణ జరగాల్సి ఉండగా.. జయప్రద కోర్టుకు హాజరు కాలేదు. ఈ అంశంపై ప్రోషిక్యూషన్‌ ఆఫీసర్‌ అమర్‌ నాథ్‌ తివారీ… నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసినా జయప్రద(Jayapradha) కోర్టుకు హాజరు కాలేదని న్యాయమూర్తికి విన్నవించారు. దీనితో న్యాయస్థానం ఈ కేసు విచారణను నవంబర్‌ 17కు వాయిదా వేసింది ఆ సమయంలో కూడా ఆమె కోర్టుకు హాజరు కాలేదు. ఆ తరువాత డిసెంబర్‌ నెలలో హాజరు కావాలని హెచ్చరించినా కూడా ఆమె అందుబాటులోకి రాలేదు.

కోర్టు వాయిదాకు జయప్రద గైర్హాజరు అవుతున్న విషయాన్ని సీరియస్‌గా పరిగణలోకి తీసుకుంకున్న కోర్టు… జనవరి 10లోగా ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించింది. దీనితో రామ్‌పూర్‌ ఎస్పీ ఆమెను వెతకడానికి ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఆ బృందం కూడా ఆమె ఆచూకీని కనిపెట్టలేకపోతుంది. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. జయప్రద కోసం పోలీసులు ముమ్మరంగా వెతుకుతున్నారు. 2019 ఎన్నికల్లో రాంపూర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన జయప్రద… సమాజ్‌వాద్‌ పార్టీ అభ్యర్థి అజాం ఖాన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

Also Read : Leesha Eclairs: హీరోయిన్ గా మారిన షారుక్ అభిమాని !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com