Jayapradha : ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా కొనసాగుతోంది. గత జనవరి 13న ప్రారంభమైన కుంభ మేళా ఈనెల 26వ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే సినీ , రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు క్యూ కట్టారు పవిత్ర స్నానం చేసేందుకు.
Jayapradha Sensational At…
యూపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు 40 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానం చేశారని వెల్లడించారు సీఎం యోగి ఆదిత్యానాథ్. ప్రియాంక జైన్, కబీర్ ఖాన్, బిగ్ బాస్ బ్యూటీ తో పాటు తెలుగు, తమిళ, హిందీ సినీ రంగానికి చెందిన ప్రముఖులు కుంభ మేళాలో స్నానం చేశారు. పవిత్రమైన గంగమ్మ ఒడిలో సేద దీరారు. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ఉత్సవంలో పాల్గొనడం తాను అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఈ సందర్బంగా నటి జయప్రద(Jayapradha).
మాజీ ఎంపీ మీడియాతో మాట్లాడారు. కుంభ మేళాకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడి ఏర్పాట్లు సూపర్ అంటూ ప్రశంసలు కురిపించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేసినందుకు సీఎం యోగి ఆదిత్యానాథ్ కు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు జయప్రద.
ఈ అద్భుతం చూడటం మాములు విషయం కాదన్నారు. భద్రత, పరిశుభ్రత, రవాణా, ఇతర ముఖ్యమైన సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఆధ్యాత్మిక సమావేశానికి హాజరయ్యే భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం శిబిరాలు, వైద్య సేవలు, భద్రతా మోహరింపులు, ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఈ క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
Also Read : Hero Thalapathy Vijay : దళపతి సరసన క్రేజీ హీరోయిన్