Jayam Ravi: ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పదం ‘విడాకులు’. సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత… సెలబ్రిటీల విడాకులు అనగానే అంతా ఆసక్తిని కనబరుస్తున్నారు. ధనుష్, నిహారిక.. ఇలా ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకునే వారి సంఖ్య బాగానే పెరుగుతోంది. ఇప్పుడీ లిస్ట్‌లోకి మరో తమిళ హీరో జయం రవి చేరబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Jayam Ravi..
తమిళ ఇండస్ట్రీకే కాకుండా… టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా జయం రవి పరిచయమే. ఎలా అంటే, జయం రవి(Jayam Ravi) వాళ్ల నాన్న ప్రముఖ ఎడిటర్ మోహన్. అలాగే జయం రవి వాళ్ల అన్న రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవితో ‘గాడ్‌ఫాదర్’ సినిమా తీసిన మోహన్ రాజా. ఈ ఫ్యామిలీ అంతా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మరి ఈ ఫ్యామిలీలో ఏమైందో ఏమో గానీ… కొన్నాళ్లుగా జయం రవి, అతని భార్య విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.
జయం రవి 2009లో ఆర్తీ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఎంతో సంప్రదాయబద్దంగా పెద్దలందరి సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఇద్దరు మగపిల్లలకు జన్మనించిన ఈ జంట దాదాపు 15 సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. అయితే ఏమైందోఏమో గాని ఈ జంట విడిపోతున్నారంటూ సడెన్ గా వార్తలు ప్రచారమవున్నాయి. ఈ జంల మధ్య అసలు ఏమై ఉంటుందా? అని అంతా అనుకుంటున్నారు. కోలీవుడ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం… కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయని, ఒకరంటే ఒకరికి పడటం లేదనేలా టాక్ వినబడుతోంది. ఈ వార్తలకు బలం చేకూర్చేలా… ఆర్తీ తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి తన భర్త ఫొటోలన్నింటినీ తీసేసింది. అంతే… ఇక జయం రవి, ఆర్తీ విడిపోతున్నారు… అందుకే ఆర్తీ ఆ ఫొటోలని తీసేసిందంటూ కోలీవుడ్ మీడియా టామ్ టామ్ చేస్తోంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరూ కూడా ఈ వార్తలపై స్పందించకపోవడం గమనార్హం.
Also Read : 1000 Wala: థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో.. ‘1000 వాలా’ టీజర్ !