Jaya Pradha : జయ ప్రధా తప్పిపోయీందా..?

జయ ప్రధా తప్పిపోయీందా..అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి

hello telugu - Jaya Pradha

Jaya Pradha : సినీ నటి జయప్రద తప్పిపోయింది.. అవును మీరు విన్నది నిజమే ఆమె తప్పిపోయిందని పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు. అసలు విషయం ఏమిటంటే జయప్రదపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. లోక్ సభ ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు జయప్రదపై కోర్టులో కేసు దాఖలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని కోర్టు పలుమార్లు ఆదేశాలు జారీ చేసినా ఆమె హాజరుకాలేదు. కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Jaya Pradha Missing Viral

ఆమె ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన రెండు కేసుల్లో నిందితురాలు. కోర్టు ఆమెను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నవంబర్ 8న కేసు విచారణ జరగాల్సి ఉంది కానీ ఆమె కోర్టుకు హాజరు కాలేదు. తర్వాత, కోర్టు కేసును నవంబర్ 17కి వాయిదా వేసింది. అయితే, ఆమె కోర్టుకు హాజరు కాలేదు. డిసెంబర్ నెలలో హాజరు కావాలని జయప్రదకు(Jaya Pradha) కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

అయితే ఆమె లెక్కించలేదు. ఏదేమైనా జనవరి 10లోగా ఆమెను కోర్టు ముందు హాజరుపరచాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. జయప్రద కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆమె ప్రస్తుత ఆచూకీ తెలియదు. పోలీసులు ఆమెను కనుగొనే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఈ వార్త కోలీవుడ్‌లో వైరల్‌గా మారింది.

Also Read : Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ తనదే అంటున్న అల్లరి నరేష్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com