Jaya Prada : ప్రముఖ నటి జయప్రద సోదరుడు రాజ బాబు కన్నుమూశారు. ఈ విషయాన్ని సోదరి, రాజకీయ నేత జయప్రద(Jaya Prada) వెల్లడించారు. తనను వెన్నంటి ఉంటూ, తనను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన సోదరుడు లేక పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
Jaya Prada Brother Death…
రాజబాబు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. రాజబాబు కూడా నటుడు, నిర్మాత కూడా. ఆయనకు ప్రజల్లో విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం హైదరాబాద్ లో జరుగుతాయని వెల్లడించారు జయప్రద.
తన సోదరుడి మరణంతో జయప్రద కన్నీటి పర్యంతం అయ్యారు. నా అన్నయ్య రాజ బాబు ఇవాళ స్వర్గస్తుడయ్యాడు. ఆయన ఆత్మ స్వర్గంలో ప్రశాంతంగా ఉండాలని అభిమానులు, కుటుంబీకులు ప్రార్థించాలని కోరారు . సోషల్ మీడియా వేదికగా ఆవేదన చెందారు.
జయప్రద రాజకీయ జీవితంలో సోదరుడు వెన్నంటి ఉంటూ వచ్చారు. గతంలో సినిమాలలో నటించారు కూడా. జయప్రద ఎంపీగా ఉన్నప్పుడు, ప్రతి ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు.
Also Read : Actor Posani Shocking :పోసాని మౌనం ఖాకీలు ఆగ్రహం