Jawan Trailer : అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన షారుక్ ఖాన్ నటించిన జవాన్ ట్రైలర్ అదుర్స్ అనిపించేలా ఉంది. బాద్ షా ఫ్యాన్స్ ట్రైలర్ చూసి పండుగ చేసుకుంటున్నారు. ఇక కాళీ ప్రతి నాయకుడి పాత్రలో తనదైన స్టైల్ లో విజయ్ సేతుపతి సత్తా చాటాడు.
ఇక ఇప్పటికే దిగ్గజ నటుడిగా గుర్తింపు పొందిన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తన నటనతో మైమరిచి పోయేలా చేశాడు. ఆయనకు తోడుగా అందాల తార నయన తార, లవ్లీ బ్యూటీ దీపికా పదుకొనే కలిసి నటించారు జవాన్ మూవీలో.
Jawan Trailer Trending
ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఓవర్సీస్ లో దుమ్ము రేపేలా ముందస్తు టికెట్లు అమ్ముడు పోయాయి. ఇదిలా ఉండగా అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన జవాన్(Jawan) చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7న విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి.
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ , పాటలు జనాదరణ పొందాయి. షారుక్ ఖాన్ భార్య పేరుతో జవాన్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపు భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు అట్లీ కుమార్. దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు టాక్. విచిత్రం ఏమిటంటే జవాన్ విడుదల కాకుండానే పెట్టిన డబ్బులు తిరిగి రావడమే కాకుండా రికార్డు స్థాయిలో వసూలు కావడం విశేషం.
సినీ వర్గాల అంచనా ప్రకారం రూ. 350 కోట్ల బిజినెస్ జరిగిందని టాక్.
Also Read : Raghava Lawrence : ఓం రాఘవేంద్రాయ నమః – లారెన్స్