ఈ ఏడాది బాలీవుడ్ లో ఇద్దరు అదృష్టవంతులు ఉన్నారు. వారెవరో కాదు ఒకరు బాద్ షా షారుక్ ఖాన్ అయితే మరొకరు కో స్టార్ దీపికా పదుకొనే. ఇద్దరికీ బాగా కలిసొచ్చింది. షారుక్ , ముద్దుగుమ్మ కలిసి పఠాన్ లో నటించారు. ఇది ఎవరూ ఊహించని విధంగా రూ. 1,000 కోట్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా తన పవర్ ఏమిటో చూపించాడు షారుక్ ఖాన్.
ఆ తర్వాత వచ్చిన మరో మూవీ తమిళ సినీ రంగానికి చెందిన మోస్ట్ టాలెంటెడ్ , యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్. తనతో జవాన్ తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. దీంతో తెగ సంతోషానికి లోనయ్యాడు బాద్ షా.
ఇందులో షారుఖ్ ఖాన్ తో పోటీ పడి నటించింది 40 ఏళ్ల అందాల సుందరి నయన తార. తను ఇద్దరి పిల్లలకు తల్లి. అయినా ఎక్కడా తగ్గలేదు. దీపికా పదుకొనే ఇందులో కీలక పాత్ర పోషించగా విలన్ గా విజయ్ సేతుపతి కీ రోల్ పోషించాడు. ఇది కూడా రూ. 1,000 కోట్ల మార్క్ దాటేసింది. ఇప్పుడు భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం.
నవంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా జవాన్ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో అదనపు సన్నివేశాలను కూడా జోడించారు. ఏది ఏమైనా మూవీని చూడని వాళ్లకు ఇది అరుదైన కానుక అని స్పష్టం చేసింది నెట్ ఫ్లిక్స్.