తమిళ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జవాన్ మూవీ సంచలనం సృష్టించింది. భారీ కలెక్షన్లతో దుమ్ము రేపింది. షారుక్ ఖాన్ తో పాటు నయనతార, దీపికా పదుకొనే, విజయ్ సేతుపతి కీలక పాత్రలలో నటించారు. సెప్టెంబర్ 7న విడుదలైన జవాన్ చిత్రం కంటిన్యూవ్ గా వసూళ్ల వేట కొనసాగుతోంది.
బాలీవుడ్ పరంగా అత్యంత వేగంగా కలెక్షన్లు సాధించిన హిందీ చిత్రంగా షారుక్ ఖాన్ జవాన్ నిలిచింది. మూవీ పరంగా రోజుల వారీగా చూస్తే రూ. 825 కోట్లకు పైగా వసూలు చేసింది. 1వ రోజు రూ.125.05 కోట్లు, 2వ రోజు రూ. 109.24 కోట్లు, 3వ రోజు రూ. 140.17 కోట్లు, 4వ రోజు రూ. 156.80 కోట్లు , 5వ రోజు రూ. 52.39 కోట్లు వసూలు చేసింది.
ఇక 6వ రోజు రూ.38.21 కోట్లు , 7వ రోజు రూ. 34.06 కోట్లు, 8వ రోజు రూ. 28.79 కోట్లు, 9వ రోజు రూ. 26.35 కోట్లు , 10వ రోజు రూ. 51.64 కోట్లు, 11వ రోజు రూ. 59.15 కోట్లు వసూలు చేసింది జవాన్ చిత్రం. మొత్తంగా రూ. 821.85 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టింది.
ఇందులో షారుక్ ఖాన్ ద్విపాత్రాభినయం చేశాడు. నయన తార అద్భుతమైన నటన, దీపికా పదుకొనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇప్పటికే షారుక్ ఖాన్ నటించిన ఈ జవాన్ చిత్రం రూ. 1000 కోట్ల క్లబ్ లోకి చేరుకునేందుకు పరుగులు తీస్తోంది.