యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రం వసూళ్ల వేట కొనసాగిస్తోంది. ఇప్పటికే రూ. 900 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించింది. ఈ మూవీలో బాద్ షా షారుక్ ఖాన్ , నయన తార, దీపికా పదుకొనే, విజయ్ సేతుపతి నటించారు.
షారుక్ ఖాన్ మేనరిజం సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. ఇక అందాల తార నయనతార అద్భుతమైన పర్ ఫార్మెన్స్ సూపర్ గా నిలిచింది. వసూళ్ల పరంగా టాప్ లో కొనసాగుతోంది. విడుదలైన అన్ని థియేటర్లలో జవాన్ కు ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి.
ఇక వసూళ్ల పరంగా చూస్తే తొలి రోజు రూ. 125.05 కోట్లు సాధించింది. 2వ రోజు రూ. 109.24 కోట్లు, 3వ రోజు రూ. 140.17 కోట్లు, 4వ రోజు రూ. 156.80 కోట్లు, 5వ రోజు రూ. 52.39 కోట్లు, 6వ రోజు రూ. 38.21 కోట్లు , 7వ రోజు రూ. 34.06 కోట్లు, 8వ రోజు రూ. 28.79 కోట్లు, 9వ రోజు రూ. 26.35 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.
జవాన్ చిత్రం 10వ రోజు రూ. 51.64 కోట్లు, 11వ రోజు రూ. 59.15 కోట్లు, 12వ రోజు రూ. 21.07 కోట్లు , 13వ రోజు రూ. 19.54 కోట్లు, 14వ రోజు రూ. 15.37 కోట్లు , 15వ రోజు రూ. 13.25 కోట్లు, 16వ రోజు రూ. 10.48 కోట్లు, 17వ రోజు రూ. 24.61 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా జవాన్ ఇప్పటి వరకు రూ. 926.17 కోట్లు కలెక్షన్స్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.