Jawan: జవాన్‌ మూవీ అరుదైన రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌!

జవాన్‌ మూవీ అరుదైన రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌!

Hello Telugu - Jawan

Jawan: రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై అట్లీ దర్శకత్వంలో షారూక్ ఖాన్, విజయ్ సేతుపతి, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘జవాన్‌(Jawan)’. సుమారు 300 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ సినిమా… ప్రపంచ వ్యాప్తంగా రూ. 1150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (ఐఎమ్‌డీబీ) విడుదల చేసిన మోస్ట్‌ పాపులర్‌ చిత్రాల జాబితాలోనూ మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఈ సినిమాపై దర్శకుడు అట్లీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Jawan Records

2023లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వెతికిన సినిమాల జాబితాలో జవాన్‌ చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని అట్లీ తన సోషల్ మీడియా ఎక్స్ ద్వారా పంచుకున్నారు. వరల్డ్‌ వైడ్‌గా గూగుల్‌లో అత్యధిక మంది వెతికిన చిత్రాల్లో జవాన్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి, రెండు స్థానాల్లో హాలీవుడ్ చిత్రాలు బార్బీ, ఓపెన్ హైమర్ నిలిచాయి. అంతే కాకుండా బాలీవుడ్ చిత్రాలైన గదర్-2, పఠాన్  వరుసగా 8,10 స్థానాలు దక్కించుకున్నాయి. కాగా.. ఈ వివరాలను వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది.

Also Read : Vijay Sethupathi: కూతురి లాంటి కృతితో రొమాన్స్‌ చేయలేనని తేల్చి చెప్పిన విజయ్ సేతుపతి!

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com