Jawan Create : బాలీవుడ్ లో ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోంది. అదే బాద్ షా షారుక్ ఖాన్ , నయనతార , దీపికా పదుకొనే కలిసి నటించిన జవాన్ రిలీజ్ కోసం భారీ ఎత్తున ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 7 గురువారం ముహూర్తం నిర్ణయించారు జవాన్ మూవీ మేకర్స్.
Jawan Create Trending Records
ఈ చిత్రానికి అట్లీ కుమార్ దర్శకత్వం వహించారు. షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ రూ. 220 కోట్లు ఖర్చు చేసి దీనిని నిర్మించారు. విచిత్రం ఏమిటంటే విడుదల కాక ముందే రూ. 350 కోట్లు కొల్లగొట్టింది. ఇక రాబోయే రోజుల్లో ఇంకెన్ని కోట్లు కలెక్షన్స్ చేస్తుందో తెలియడం లేదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
జవాన్(Jawan) లో ప్రతి నాయకుడిగా తమిళ సూపర్ హీరో విజయ్ సేతుపతి నటించాడు. ఇదే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులో షారుక్ ఖాన్ ద్విపాత్రిభినయం చేస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. ముందే రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
ముందస్తే రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇది ఓ రికార్డ్. అడ్వాన్స్ సేల్స్ తొలి రోజు భారత్ లో రూ. 32.47 కోట్లు సాధించింది. ఓవర్సీస్ లో రూ. 18.70 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా విడుదలకు ముందు రూ. 51.17 కోట్లు సాధించి హాఫ్ సెంచరీ సాధించింది.
Also Read : Javed Ali Tu Meri Roja : ‘అలీ’ మేరీ రోజా సాంగ్ వైరల్