తమిళ సినీ రంగంలో పాపులారిటీకి కొదువ లేదు. సినీ టెక్నీషియన్స్ , నటీ నటులు, దర్శక నిర్మాతలు, ప్రతిభావంతులు లెక్కలేనంత మంది ఉన్నారు. తాజాగా విడుదలైన సినిమాలు దుమ్ము రేపాయి. భారీ ఎత్తున వసూళ్లు చేశాయి. ఇందులో రజనీకాంత్ నటించిన జైలర్ ఉండగా జోసెఫ్ విజయ్ నటించిన లియో కూడా పోటా పోటీగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దీనికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు.
ఇటు తమిళం అటు తెలుగు సినీ రంగాలలో సుపరిచితమైన నటుడు కార్తీ. అక్కినేని నాగార్జునతో కలిసి దృశ్యంలో నటించాడు. ఇక సినీ దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ లో అద్భుతంగా నటించాడు కార్తీ. ఈ చిత్రం ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. కలెక్షన్ల వరద పారించింది.
దీనికి సీక్వెల్ కూడా వచ్చింది. ఇది కూడా ఆశించిన స్థాయికంటే గొప్పగా నడిచింది. కార్తీ నుంచి కీలక అప్ డేట్ రావడం ఆసక్తిని రేపుతోంది. ఈ మూవీకి సంబంధించి జపాన్ ఆడియో లాంచ్ జరిగింది. ఇందులో కథేమిటంటే డబ్బులు, నగలు దోచుకెళ్లి ఖాకీలకు పట్టుబడకుండా ఉండే దొంగ పాత్రలో నటించాడు కార్తీ. అతడికి తోడుగా అనూ ఇమాన్యూయుల్ నటించింది.