Japan Movie : ఖైదీ సినిమాతో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న తమిళ హీరో కార్తీ నటించిన “జపాన్” సినిమాను దీపావళి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ, అను ఇమాన్యుయేల్ జంటగా నటించిన ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు. “జపాన్(Japan Movie)” సినిమాకు సంబందించి ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలకు, పాటలకు తెలుగులో కూడా మంచి స్పందన రావడంతో అదిరిపోయే రేంజ్ లో సినిమా ప్రమోషన్ చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధమయ్యారు. దీనితో భాగంగా హైదరాబాద్ లోని జే ఆర్ సి కన్వెన్షన్ హాల్ లో సినిమా ప్రీ రిలీజ్ ఇవెంట్ నిర్వహించానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసారు.
Japan Movie – “జపాన్” సినిమా ప్రమోషన్ లో నేచురల్ స్టార్ నాని
“జపాన్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నేచురల్ స్టార్ నానిను ముఖ్యఅతిధిగా హాజరుకాబోతున్నట్లు చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కార్తీ సినిమా ప్రమోషన్ లో నేచురల్ స్టార్ నాని పాల్గొనబోతుండటంతో అటు కార్తీ ఇటు నాని అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. దీపావళి కానుకగా వస్తున్న ఈ సినిమాకు కార్తీ, నాని లు శుక్రవారం ఒకే స్టేజిపై చూడటం ద్వారా అభిమానులకు దీపావళి ముందే వస్తుందనడంలో సందేహం లేదు.
Also Read : Mehreen Pirzada Vs Krithi Shetty