Jani Master : సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, రేవతి మరణం, శ్రీతేజ్ ఆస్పత్రి పాలు, అల్లు అర్జున్ అరెస్ట్.. ఇదీ ప్రస్తుతం టాలీవుడ్‌లో నడుస్తున్న హాట్ టాపిక్. దాదాపు రెండువారాలకు పైగా ఇదే సంచలనం. ప్రస్తుతం బెయిల్ మీద బయటున్న అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసుల నుంచి నోటీసులు అందాయి. మంగళవారం విచారణకు హాజరు కావాలని ఆ నోటీస్ సారాంశం. అయితే ఈ రోజు 11 గంటలకు బన్నీ తన లీగల్ టీమ్‌తో కలిసి విచారణకు హాజరు కానున్నారని తెలుస్తోంది.
Jani Master Comments
ఈ నేపథ్యంలో ఈ విషయంపై స్పందించాలని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను మీడియా కోరగా ‘‘ఈ విషయంలో నేనేం మాట్లాడదలుచుకోలేదు. నేనే ఒక ముద్దాయిని. నాపై ఆరోపణలు ఉన్నాయి. నా కేసు కోర్టులో ఉంది. కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు. న్యాయస్థానంపై, నాకు నమ్మకం ఉంది. అందరికీ మంచి జరగాలి’ అని జానీ మాస్టర్ అన్నారు.జైలుకు వెళ్లకముందు.. వెళ్లొచ్చిన తర్వాత మీకు ఇండస్ట్రీలో మర్యాద ఎలా ఉంది? అని అడగ్గా.. ఒకేలా ఉందని జానీ మాస్టర్ సమాధానమిచ్చాడు. గుండెల మీద చెయ్యి వేసి మరీ చెబుతున్నా పరిశ్రమలు నా గుర్తింపు, గౌరవం ఎప్పటిలాగే ఉంది’’ అని అన్నారు.
Also Read : Shyam Bengal : సీనియర్ దర్శకుడు, నిర్మాత ‘శ్యామ్ బెంగాల్’ కన్నుమూత