Jani Master : జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు

ఆమె మాట్లాడుతూ.. ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను ప్లాన్ ప్రకారం ట్రాప్ చేస్తున్నారు...

Hello Telugu - Jani Master

Jani Master : జానీ మాస్టర్‌ పై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదైంది. ఇప్పటికే బాధితురాలు స్టేట్మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. మైనర్‌గా ఉన్న సమయంలోనే జానీ ముంబై హోటల్‌లో తనపై అత్యాచారం చేసినట్లుగా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు జానీ(Jani Master) కేసులో ఎఫ్‌ఐఆర్‌లో పోక్సో యాక్ట్‌ యాడ్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న జానీని పట్టుకునేందుకు పోలీసులు కొన్ని బృందాలుగా విడిపోయి మరీ సెర్చ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు జానీ మాస్టర్ కేసుపై ‘లవ్ జిహాద్’ ఆరోపణలు చేశారా బీజేపీ‌ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి.

Jani Master Case…

ఆమె మాట్లాడుతూ.. ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను ప్లాన్ ప్రకారం ట్రాప్ చేస్తున్నారు. మతం మార్చుకుని పెళ్ళి చేసుకోవాలని జానీ బాధితురాలని వేధించాడు. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పటి నుంచే జానీ(Jani Master) వేధిస్తున్నాడని ఫిర్యాదులో తెలిపింది. బాధిత అమ్మాయికి న్యాయం జరిగేవరకు బీజేపీ అండగా ఉంటుందని బీజేపీ‌ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి వెల్లడించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై అత్యాచారం కేసు నమోదైంది. మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు అందడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

సెక్షన్ 376తో పాటు క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం(323) క్లాజ్ (2) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ జూనియర్ డ్యాన్సర్ ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టాడంటూ బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించింది. ఫిర్యాదు చేసిన యువతి వయసు 21 సంవత్సరాలు అని తెలిసింది. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. ఘటన నార్సింగి పరిధిలో జరగడంతో కేసుని అక్కడికి బదిలీ చేశారు. ఔట్ డోర్ షూటింగులలో తనపై అత్యాచారం చేశాడని యువతి పేర్కొంది. జీరో ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి కేసును ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇప్పుడీ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. దీనిపై టాలీవుడ్‌లో రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also Read : Poonam Kaur : పూనమ్ ట్వీట్ పై స్పందించిన ఫిల్మ్ ఛాంబర్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com