Jani Master : ఓ యువతిపై అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో పోలీసుల కస్టడీ విచారణ కొనసాగుతోంది. మూడో రోజు జానీ మాస్టర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. బాధితురాలు స్టేట్‌మెంట్‌ను ముందు ఉంచి జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు విచారించారు. అయితే పోలీసుల విచారణలో బాధితురాలే తనను వేధించిందని జానీ మాస్టర్(Jani Master) చెప్పినట్లు సమాచారం. ‘‘ నాపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. ఢీ షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుంది. మైనర్‌గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాననేది అబద్ధం. తన టాలెంట్‌ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చాను. తనని పెళ్లి చేసుకోవాలని బాధితురాలు మానసికంగా హింసించేది… ఎన్నోసార్లు నాపై ఆమె బెదిరింపులకు దిగింది. నేను పడుతున్న ఇబ్బందిని డైరెక్టర్ సుకుమార్ దృష్టికి కూడా తీసుకెళ్ళాను. సుకుమార్ పిలిచి మాట్లాడినా కూడా బాధితురాలిలో మార్పు రాలేదు. నాపై కుట్ర జరిగింది, వెనుక ఉండి ఎవరో నాపై కుట్ర చేశారు. నా ఎదుగుదలను ఓర్వలేకనే ఈ కేసులో నన్ను ఇరికించారు’’ అని జానీ మాస్టర్ విచారణలో పోలీసులకు తెలిపారు.
Jani Master Investigation…
మరోవైపు భర్తను కలవడానికి జానీ మాస్టర్(Jani Master) భార్య నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ కేసులో నాలుగు రోజుల పాటు జానీమాస్టర్‌ను పోలీస్ కస్టడీకి రంగారెడ్డి కోర్టు అనుమతించింది. ఇప్పటికే మూడు రోజుల పాటు జానీమాస్టర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించగా.. రేపటి (శనివారం)తో జానీ మాస్టర్ కస్టడీ విచారణ ముగియనుంది. రేపు ఉదయం జానీ మాస్టర్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా.. తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న 21 ఏళ్ల యువతిపై లైంగిక దాడి కేసులో జానీమాస్టర్‌ను ఇటీవలే పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన్ను గోవాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి నగరానికి తీసుకొచ్చి రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్‌పల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి, ఇరువర్గాల వాదనలూ విన్న న్యాయమూర్తి.. అక్టోబరు 3 వరకు (14 రోజుల) రిమాండ్ విధించారు. దీంతో ప్రస్తుతం జానీ మాస్టర్ చంచల్‌గూడ్ జైలులో ఉన్నారు.
Also Read : Aishwarya Lekshmi : అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన హీరోయిన్ ఐశ్వర్య