Jani Master : లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఊహించని భారీ షాక్ తగిలించింది. అత్యాచారం కేసులో అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్‌కు మరో బిగ్‌షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం జానీ మాస్టర్(Jani Master)కు ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డు రద్దు చేసింది. పోక్సో కేసు నమోదు కావడంతో అవార్డు రద్దుచేసినట్టు కమిటీ పేర్కొంది. తమిళ చిత్రం ‘తిరుచిట్రంబలం’ సినిమాకు గానూ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డు అందుకోబోతున్నారు జానీ మాస్టర్. 2022 సంవత్సరానికి బెస్ట్ కొరియోగ్రాఫర్ ఎంపికైన జానీ మాస్టర్, అక్టోబర్ 8వ తేదీన ఢిల్లీలో ఈ అవార్డు అందుకోవాల్సి ఉంది. అవార్డు అందుకోవడం కోసమే జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే అవార్డు రద్దుతో జానీ మధ్యంతర బెయిల్‌పై సందిగ్ధంలో పడింది.
Jani Master Award…
ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా నేషనల్ అవార్డుకు ఎంపికైన కొద్ది రోజులకే ఆయనపై అత్యాచార ఆరోపణలు రావడంతో అరెస్టయ్యారు. లైంగికంగా వేధించి.. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడన్నది బాధితురాలి ఆరోపణ. హైదరాబాద్, ముంబైతోపాటు ఔట్‌డోర్ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు లైంగిక దాడి చేసేవాడని కంప్లైంట్‌లో పేర్కొంది. వేధింపులే కాదు.. జానీ, అతని భార్య కొట్టేవారని, చెప్పినట్టు వినకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని బెదిరించారంటోంది బాధితురాలు. వీటిన్నింటిపైనా జానీ(Jani Master)పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.
మైనర్‌గా ఉన్నప్పుటి నుంచే అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తోంది బాధితురాలు. షూటింగ్ సమయంలోనూ వ్యాన్‌లోకి తీసుకెళ్లి బలవంతం చేసేవాడని, ప్రతిఘటిస్తే కొట్టేవాడని అంటోంది. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని టార్చర్ చేసేవాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఆరోపణలపైనా జానీని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు పోలీసులు. అయితే అక్టోబర్ 8వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోమధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు జానీ మాస్టర్. దీంతో జానీ మాస్టర్‌కు నాలుగు రోజులపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరిని ప్రభావితం చేయకూడదని కోర్టు షరతు విధించింది.
Also Read : Vanitha Vijaykumar : వనిత 4వ పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పందన ఇదే..