Nagababu : అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించాడంటూ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జానీ మాస్టర్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసు బృందం అతన్ని అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈ విషయంపై నటుడు నాగబాబు చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ‘ న్యాయస్థ్థానంలో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు’ అని బ్రిటిష్ లాయర్ సర్ విలియం గారో కొటేషన్‌ను నాగబాబు రాసుకొచ్చారు.
Nagababu Tweet
‘మీరు విన్న ప్రతి దాన్ని నమ్మవద్దు. ప్రతి కథకు మూడు పార్శ్వాలు ఉంటాయి. మీ వైపు, నా వైపు మరియు నిజం’ అని అమెరికా జర్నలిస్ట్ రాబర్ట్ ఎవాన్స్ రాసిన కొటేషన్‌ను మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ రెండు ట్వీట్‌లలో జానీ మాస్టర్ గురించి ప్రస్తావించకపోయినా ఆయన పరోక్షంగా మద్దతు ఇచ్చినట్టు భావిస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ చర్చనీయాశంగా మారాయి. దీనికి కారణం లేకపోలేదు. జానీ మాస్టర్ జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
Also Read : Jr NTR : ‘దేవర’ టైటిల్ నిర్ణయంపై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్