Janhvi Kapoor : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

ఏడుకొండల వారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

Hello Telugu - Janhvi Kapoor

Janhvi Kapoor : ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన్ సమయంలో ఆమె స్వామివారి సేవలో హాజరయ్యారు. జాన్వీతో పాటు సీనియర్ నటి మహేశ్వరి, కూడా కలియుగ వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. టీటీడీ(TTD) అధికారులు ఇరువర్గాలకు ఘనస్వాగతం పలికారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా జాన్వీ చీరలో చాలా ట్రెడిషనల్‌గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. జాన్వీ తిరుమల పర్యటనకు సంబంధించిన ఫోటోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Janhvi Kapoor Visited Tirumal

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుంది. కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనుంది ఈ హాట్ బాలీవుడ్ బ్యూటీ. బి-టౌన్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించనున్నాడు. బైరా పాత్రలో సైఫ్ అందరి దృష్టిని ఆకర్షించనున్నారు. ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తుంది. దేవర పార్ట్ 1 ఏప్రిల్ 5, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధాకర్ మిక్కిలినేని మరియు కోనరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను మరో 3 రోజుల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అంటే జనవరి 8న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Also Read : Prabuthwa Junior Kalashala : చల్ల గాలి సాంగ్ ను రిలీజ్ చేసిన ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ టీమ్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com