Janhvi Kapoor: రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ జంటగా శరణ్ శర్మ తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా అందులో జాన్వీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రం కోసం జాన్వీ(Janhvi Kapoor) ఎంతో కష్టపడినట్లు పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఇప్పుడీ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదల కానుంది. జులై 26 నుంచి ప్రసారం కానుంది. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావ్, రాజేశ్ శర్మ, కుముంద్ మిశ్రా తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు.
‘మిస్టర్ అండ్ మిస్సెస్ మహి’ సినిమా కోసం తాను పడిన కష్టాన్ని వివరిస్తూ గతంలో ఓ వీడియోను జాన్వీ కపూర్(Janhvi Kapoor) విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘30 రోజుల సినిమా షూటింగ్ కోసం 150 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకోవడమే కాకుండా రెండు సార్లు గాయాల పాలయినట్లు ఆమె వెల్లడించింది. ఈ సినిమా కోసం ‘మిలీ’ సినిమా షూటింగ్ సమయంలోనే శిక్షణ ప్రారంభించాను. నా కోచ్‌లు నన్ను పూర్తి క్రికెటర్‌గా మార్చారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నాకు ఎన్నో గాయాలయ్యాయి. రెండు భుజాలు పనిచెయ్యవేమో అనుకున్నా. నా ఇద్దరు కోచ్‌లు క్రికెట్ నేర్పడం కోసం ఎంతో కష్టపడ్డారు’ అని జాన్వీ వెల్లడించింది.
Janhvi Kapoor – ‘మిస్టర్ అండ్ మిస్సెస్ మహి’ సినిమా కథేమిటంటే ?
మహేంద్ర (రాజ్‌కుమార్ రావ్) ఓ ఫెయిల్యూర్ క్రికెటర్. క్రికెటర్‌గా ఉన్నత స్థానాలకు ఎదగలేకపోతాడు. మరో ఏడాది అవకాశమిస్తే తానేంటో నిరూపించుకుంటానని బతిమాలతాడు. అయినా తండ్రి వినిపించుకోకుండా తన స్పోర్ట్స్ షాప్ నిర్వహణ బాధ్యతల్ని అప్పగిస్తాడు. మహిమ (జాన్వీకపూర్) వైద్యురాలు. పెద్దలు కుదిర్చిన వివాహ బంధంతో ఒక్కటవుతారు. ఒకరి ఇష్టాలను మరొకరు తెలుసుకునే క్రమంలో ఇద్దరికీ క్రికెట్ అంటే ప్యాషన్ అని అర్థమవుతుంది. దీనితో తన భార్యలో ఉన్న టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు శిక్షణ ఇవ్వడం మొదలు పెడతాడు. మరి, ఆమె కలను సాకారం చేసే క్రమంలో మహికి ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని ఎలా ఇద్దరూ ఎదుర్కొన్నారు. మహి క్రికెట్ జర్నీ ఎంత వరకూ వెళ్లింది? అనేది కథాంశం.
Also Read : Ravi Teja: ‘మిస్టర్ బచ్చన్’సెంకడ్ సింగిల్ రిలీజ్ !