Janhvi Kapoor : సడన్ గా హైదరాబాద్ హనుమాన్ టెంపుల్ లో దర్శనమిచ్చిన జాన్వీ

ప్రస్తుతంజాన్వీ కపూర్ సౌత్‌లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది...

Hello Telugu - Janhvi Kapoor

Janhvi Kapoor : అతిలోకసుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌కు తన తల్లి మాదిరిగానే భక్తి ఎక్కువనే విషయం తెలిసిందే. ఈ విషయం ఆమె ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు. ఇంట్లో పూజలు, షూటింగ్స్ లేనప్పుడు ఆలయాలకు వెళుతుంటానని జాన్వీ కపూర్ పలుమార్లు చెప్పి ఉన్నారు. ఇదంతా తను, తన చెల్లెలు.. అమ్మని చూసే నేర్చుకున్నామని కూడా జాన్వీ(Janhvi Kapoor) వెల్లడించింది. అందుకే.. తనకు సమయం దొరికిన ప్రతిసారి తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి వెళుతుంటుంది జాన్వీ. రీసెంట్‌గా కూడా ఆమె తిరుమలలో దర్శనమిచ్చింది. ఇక ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న ఓ ఆంజనేయ స్వామి గుడిలో మెరిసింది జాన్వీ కపూర్.

Janhvi Kapoor Visited

ప్రస్తుతంజాన్వీ కపూర్(Janhvi Kapoor) సౌత్‌లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ అనే చిత్రంలో నటించిన ఆమె.. మరో స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన RC16 అనే చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. మరో రెండు, మూడు ప్రాజెక్ట్‌లు డిస్కషన్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటి కోసం హైదరాబాద్‌లోనే మకాం వేసిన జాన్వీ కపూర్.. తాజాగా హైదరాబాద్, మధురా నగర్‌లోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమాలవిరామ సమయంలో తరచూ ఆలయాలను సందర్శించే జాన్వీ కపూర్ మధురా నగర్ ఆంజనేయ స్వామి గుడిని దర్శించి పూజలు నిర్వహించింది. పూజ అనంతరం అర్చకులు ఆమెకు తీర్ధప్రసాదాలు అందించారు. జాన్వీ కపూర్ ఆలయానికి వచ్చిందని తెలిసి, ఒక్కసారిగా గుడి దగ్గరకు అభిమానులు భారీగా చేరుకున్నారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అక్కడి స్థానికులు సైతం పోటీ పడ్డారు. తనని చూడడానికి వచ్చిన వారిని జాన్వీ కూడా ఆప్యాయంగా పలకరించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. రామ్ చరణ్ సరసన నటించే సినిమా కూడా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. మరో వైపు కోలీవుడ్‌లోనూ జాన్వీ ఓ సినిమాకు సైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Also Read : Kiki Hakansson : ప్రపంచంలోనే మొదటి మిస్ వరల్డ్ ఇక లేరు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com