Allu Arjun : బాలీవుడ్ ముద్దుగుమ్మలు జాన్వీ కపూర్, దిశా పటానీ ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సరసన నటించ బోతున్నారా. అవునంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది సినీ ఇండస్ట్రీలో. ఇప్పటికే జవాన్ తో దుమ్ము రేపిన దర్శకుడు అట్లీ కుమార్ భారీ రెమ్యూనరేషన్ కు బన్నీతో మూవీ చేసేందుకు ఓకే చెప్పాడు. ఏకంగా రూ. 150 కోట్లకు పైగా పారితోషకంగా తీసుకుంటున్నట్లు సినీ వర్గాలలో చర్చ. ఇది పక్కన పెడితే దేశంలోనే అత్యధిక బడ్జెట్ తో ఇంటర్నేషనల్ స్థాయి మూవీ తీసేందుకు ముందుకు వచ్చింది కళానిధి మారన్ నేతృత్వంలోని సన్ పిక్చర్స్.
Janhvi Kapoor, Disha Patani in Allu Arjun Movie
ఈ కొత్త మూవీ కోసం ఇప్పటికే కథ చెప్పడం అందుకు బన్నీ ఓకే చేయడం జరిగింది. ఇద్దరూ కలిసి అమెరికా వెళ్లారు. అక్కడ పేరు పొందిన స్టూడియోను సందర్శించారు. ఈ మేరకు వీడియో కూడా షేర్ చేశారు. తమిళంలో మినిమం గ్యారెంటీ ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందాడు అట్లీ కుమార్. తను షారుక్ ఖాన్ కు మరో బిగ్ హిట్ ఇచ్చాడు. ఇక తీయబోయే మూవీకి ఎంత ఖర్చు అయినా సరే భరించేందుకు సిద్దంగా ఉన్నట్లు దయానిధి మారన్ చెప్పినట్లు సమాచారం. సినీ వర్గాల మేరకు దాదాపు రూ. 800 కోట్లకు పైగా బడ్జెట్ ఉండవచ్చని అంచనా. ఇందులో నటిస్తున్నందుకు బన్నీకి , డైరెక్టర్ అట్లీకి కలిపి దాదాపు రూ. 350 కోట్లకు పైగానే ఉంటుందని టాక్.
అయితే ఈ కొత్త మూవీ గురించి రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది నెట్టింట్లో. మొన్నటి దాకా ప్రియాంక చోప్రా నటిస్తుందని అనుకున్నారు. తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది. బన్నీ సరసన జాన్వీ కపూర్ తో పాటు దిశా పటానీ తెర పంచుకోబోతున్నట్లు టాక్. దేవరతో దుమ్ము రేపింది జాన్వీ. ఇక దిశా తన డ్యాన్సులతో హోరెత్తిస్తోంది. ఈ ఇద్దరి హీరోయిన్లతో అల్లు అర్జున్ జత కట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read : Beauty Radhika Apte:పూరీ విజయ్ మూవీలో రాధికా ఆప్టే