Janhvi Kapoor : పాన్ ఇండియా డైరెక్టర్ పా రంజిత్ గురించి చెప్పినా తక్కువే. సినిమాకు సామాజిక ప్రయోజనం ఉండాలని నమ్మిన వ్యక్తి. అణగారిన, బహుజనుల గురించి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తాడు. తన చిత్రాలు ఒక రకంగా డాక్యుమెంటరీలను తలపింప చేస్తాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా తీయాలంటే దమ్ముండాలి. అంతకు మించిన కమిట్మెంట్ ఉండాలి. ఒకటి కాదు రెండు మూవీస్ తీశాడు. విక్రమ్ తో ఇటీవల తంగలాన్ తీశాడు. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి.
Janhvi Kapoor New Movie Updates
తాజాగా బీ టౌన్ లో లవ్లీ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పా రంజిత్ తమిళ వెబ్ సీరీస్ స్టార్ట్ చేశాడు. భారీ బడ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ వెబ్ సీరీస్ కు శ్రీకారం చుట్టనున్నాడు. ఈ మేరకు ఒప్పందం కూడా పూర్తయింది.
ఈ వెబ్ సీరీస్ కోసం కీలకమైన పాత్రకు జాన్వీ కపూర్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ మధ్యనే కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరలో నటించింది. ఇది బిగ్ హిట్ గా నిలిచింది. పాన్ ఇండియా మూవీగా ఇది రిలీజ్ అయ్యింది. భారీ ఎత్తున కలెక్షన్లు వచ్చాయి.
కాగా ప్రారంభంలో జాన్వీ కపూర్ ఒక ప్రధాన నటుడితో కలిసి కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుందని ఫ్యాన్స్ భావించారు. తమిళ చిత్ర నిర్మాత సర్కునం దర్శకత్వం వహించిన అధిక బడ్జెట్ వెబ్ సీరీస్ లో ఉంటుందని టాక్. ప్రస్తుతం జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన నటిస్తోంది. దీనికి బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నాడు.
Also Read : ఆంధీ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ