Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సంచలనంగా మారారు. తన బర్త్ డే సందర్బంగా అద్బుతమైన పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన దేవర చిత్రం దుమ్ము రేపింది. దీనికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. బ్లాక్ బస్టర్ గా నిలవడంతో దేవర కు సీక్వెల్ తీసే పనిలో పడ్డారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Janhvi Kapoor Birthday Poster from Devara
జాన్వీ కపూర్ బిజీగా మారి పోయారు. దేవర హిట్ అయ్యాక, షారుక్ ఖాన్ తో ఓ రొమాంటిక్ సాంగ్ లో తళుక్కున మెరిశారు. ఆ తర్వాత ఊహించని రీతిలో బంపర్ ఆఫర్ దక్కించుకుంది. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఆర్సీ16 చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది జాన్వీ కపూర్(Janhvi Kapoor). ఇందులో మెగాస్టార్ కొడుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ నటిస్తున్నారు.
తన పుట్టిన రోజు సందర్బంగా అద్భుతమైన పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందమైన గొర్రె పిల్లను ఎత్తుకున్న ఫోటోను షేర్ చేశారు. సోషల్ మీడియాను షేక్ చేసింది. తాజాగా దేవర దర్శకుడు కొరటాల శివ ఆధ్వర్యంలో బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. జాన్వీ కపూర్ కత్తిని ధరించిన పోస్టర్ ను శుక్రవారం విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్స్ కలకలం రేపుతుతోంది. సోషల్ మీడియాను షేక్ చేసింది.
Also Read : Beauty Sreeleela :శ్రీలీల..కార్తీక్ లు డేటింగ్ లో ఉన్నారా..?